బిగ్ బాస్ సీజన్ 2 ప్రతి రోజు కొత్త మలుపులు తీసుకుంటుందని చెప్పాల్సిందే.. మొన్న నిన్నటి ఎపిసోడ్స్ లో ఇంట్లో అంతా హాట్ హాట్ డిస్కషన్స్ జరిగాయి. ఐదుగురు ఇంటి సభ్యులంతా కలిసి కౌశల్ ను టార్గెట్ చేయడం.. ఇసుక టాస్కులో కూడా కౌశల్, తనీష్ ఫైట్ బిగ్ బాస్ కే కోపం వచ్చేలా చేసింది.


ఇదిలాఉంటే ఈరోజు ఎపిసోడ్ మాత్రం చాలా హుందాగా సాగింది. టికెట్ టూ ఫినాలే టాస్కులో సామ్రాట్, రోల్ రైడాల మధ్య జరిగిన గుడ్లు కాపాడుకునే విధానంలో కౌశల్ రోల్ రైడాకు మద్ధతుగా నిలవగా.. సామ్రాట్ కోసం తనీష్, గీతా మాధురి, దీప్తిలు సపోర్ట్ గా నిలిచారు. నిన్నటి ఎపిసోడ్ లో కుక్క అన్న మాట అన్నందుకు కౌశల్ మీద తమ కోపాన్ని ఆదేదనని చూపించిన రోల్ రైడా ఈరోజు కౌశల్ సపోర్ట్ గా నిలిచే సరికి థ్యాంక్స్ చెప్పాడు.


అయితే కౌశల్ ఒక్కడే రోల్ వెంట ఉండటంతో సామ్రాట్ ఫైనల్స్ కు వెళ్లాడు. ఈమధ్య కాలంలో ఎలాంటి గొడవలు లేకుండా ముగిసిన ఎపిసోడ్ ఇదే అని చెప్పొచ్చు. కౌశల్ కూడా ఫైనల్స్ కు దగ్గర పడుతున్న సందర్భంగా కాస్త తగ్గినట్టు కనిపించాడు. కొసమెరుపుగా హయర్ రిఫ్రిజిరేటర్ టాస్క్ లో జత కట్టిన కౌశల్, గీతా మాధురిలు విజయం సాధించారు.


మొత్తానికి రోల్ కు కౌశల్ సపోర్ట్ దొరకడంతో టాస్కు ఓడినా కౌశల్ చేసిన సపోర్ట్ కు రోల్ రైడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. టాస్క్ ఓడిపోయినా సరే సామ్రాట్ మీద ఎలాంటి బేధాభిప్రాయం చూపించలేదు. ఇద్దరి గుడ్లు పగలకొట్టి ఫైనల్స్ కు ఎవరిని పంపించకుండా చేయాలనుకున్న కౌశల్ ప్లాన్ వర్క్ అవుట్ కాకున్నా ఇంట్లో ఓ పాజిటివ్ వైబ్ అయితే వచ్చిందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: