నిన్నరాత్రి జరిగిన ‘దేవదాస్’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాగార్జున నాని వ్యక్తిత్వం పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. నాని చాల మంచి నటుడు అని ప్రశంసిస్తూ అతడి డైలాగ్ డెలివరీ చాల అద్భుతంగా ఉంటుందని ప్రశంసలు కురిపించాడు నాగ్. 
Rashmika Mandanna, Nani, Nagarjuna, Aakanksha Singh in Devadas Music Party Today Poster
అంతేకాదు నాని ఒక వండర్ ఫుల్ కో-స్టార్ అంటూ నేచురల్ స్టార్ నానీకి జోష్ ను కలిగించాడు. ఇదే సందర్భంలో నాగార్జున మరో ట్విస్ట్ ఇస్తూ తాను నానీని చూసినప్పుడల్లా అతడికి అన్ని విధాల అండగా ఉండాలి అన్న ఫీలింగ్ కలుగుతుందని అంటూ ఆ ఫీలింగ్ వల్లే తాను నానీతో చాల సులువుగా ‘దేవదాస్’ సినిమాలో నటించ గలిగాను అంటూ నానీని ఆకాశంలోకి ఎత్తేశాడు నాగార్జున. 
Devdas Teaser
ఇక రష్మిక గురించి మాట్లాడుతూ తాము అంతా ఈసినిమాకు సంబంధించి థాయిలాండ్ షూటింగ్ ముగించుకుని ఇండియా తిరిగి వస్తున్నప్పుడు తనకు రష్మిక బాడీ గార్డ్ లా మారి తన సొంత ఇంటి అమ్మాయిలా తన గురించి పట్టించుకుంది అంటూ ఆమె వ్యక్తిత్వాన్ని కూడ ప్రశంసించాడు ఈ మన్మధుడు. ఈసినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తున్న ఆకాంక్ష చాల బ్యూటిఫుల్ కో-స్టార్ అంటూ ఈసినిమా షూటింగ్ ఒక పిక్నిక్ లా జరిగిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు.
Devadas Trailer: Charming Nag and Adorable Nani
ఇక తన కుటుంబ సభ్యుల సినిమాల గురించి మాట్లాడుతూ ఒకే నెలలో తన కొడుకు కోడలు సినిమాలతో పాటు తన సినిమా కూడ విడుదలయ్యే రికార్డ్ తన కుటుంబానికి లభించడం చాల గర్వంగా ఉంది అంటూ ఈ ఏడాది సెప్టెంబర్ అంతా తమ కుటుంబంలో ఒక పండుగ వాతావరణం కనిపించింది అన్న అభిప్రాయాలను వెల్లడించాడు. ఈమధ్య కాలంలో జరుగుతున్న టాప్ హీరోల సినిమా ఫంక్షన్స్ లో ఎదో ఒక వివాదం ఎవరో ఒకరి మాటల ద్వారా రాజుకోవడం సర్వసాధారణమైన పరిస్థుతులలో ఎలాంటి గందరగోళం లేకుండా ప్రశాంతంగా ‘దేవదాస్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: