విజయదేవరకొండ నటించిన నోటా సినిమాకు  ఇప్పుడు రిలీజ్ భయం పట్టుకున్నది. ఈ సినిమాను అక్టోబర్ అయిదున విడుదల చేద్దాం అనుకున్నారు నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా. అంతా ఓకే అనుకున్నారు. కానీ అంతలో ఆయనకే ఓ అనుమానం వచ్చింది. నోటా విడుదలయిన వారంలో అరవింద సమేత వీర రాఘవ వస్తే, నోటాను థియేటర్లలోంచి తీసేస్తారేమో? అని. కానీ ఆ సమస్య లేదని, ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఆడుతున్న సినిమాలు ఏవీ ఫస్ట్ వీక్ దాకా వుండే చాన్స్ లేదని, కావాల్సినన్ని స్క్రీన్ లు వుంటాయని అందరూ నచ్చ చెప్పారు. 

Image result for vijayadevarkonda

కాదు, నోటాను 18న విడుదల చేస్తా అంటూ జ్ఞాన్ వేల్ రాజు అడ్డం తిరిగినట్లు బోగట్టా. కానీ దానికి దిల్ రాజు ససే మిరా అన్నారు. జ్ఞాన్ వేల్ రాజా సన్నిహితుడు యువి వంశీ కూడా 18 న అయితే తమ  వైపు నుంచి సహకారం కష్టం అవుతుందని చెప్పేసినట్లు తేలుస్తోంది. దిల్ రాజు కూడా 18న తన సినిమా 'హలో గురూ ప్రేమ కోసమే' వుందని, అప్పుడు వేయడానికి వీలులేదని అడ్డం పడ్డారు. 

Image result for vijay devarakonda

పైగా తమిళంలో కూడా నోటా విడుదలకు 18 పెద్ద అనుకూలమైన డేట్ కాదని తెలుస్తోంది. అప్పుడు అక్కడ చాలా సినిమాలు వున్నాయి. అందువల్ల ఈ సినిమాకు మహా అయితే వందా, రెండువందల స్క్రీన్ లు దొరకడం కష్టం. విజయ్ దేవరకొండను తమిళంలో లాంచ్ చేస్తూ, వందా రెండు వందల స్క్రీన్లలో వేయడం అంటే సరికాదని, జ్ఞాన్ వేల్ కు సన్నిహితులు నచ్చ చెప్పే ప్రయత్నం చేసారు.అదే సమయంలో కర్ణాటకలో కూడా పెద్ద సినిమాలు ఒకటి రెండు వున్నాయి. దీనితో నోటా రిలీజ్ డేట్ సందిగ్ధం లో పడిపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: