త్రివిక్రమ్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో రాబోతున్న ‘అరవింద సమేత’ మూవీకి సంబంధించిన నాలుగు పాటలు బయటకు వచ్చాయి.  ఈమూవీ పాటలకు సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ అందించిన సంగీతం రొటీన్‌ కు భిన్నంగా ఉండి ఆపాటల్లో మెలోడి ఆర్ధత ఆవేదన స్పష్టంగా కనిపిస్తున్నా ఇలాంటి పాటలు తెర పైన చూస్తే మాస్ ప్రేక్షకులు ఎంతవరకు కనెక్ట్ అవుతారు అన్న అనుమానాలు జూనియర్ అభిమానులకు ఆందోళన కలిగిస్తున్నాయి.
మాస్‌ బీట్‌తో రెడ్డి ఇక్కడ సూడు పాట
ఈమూవీలోని ‘పెనివిటి’ వింటే రాయలసీమ ముఠాల క్షలకు బలి అవుతున్న కుటుంబాలకు సంబంధించిన మహిళల కన్నీటి వేదనగా కనిపించినా ఆఫ్యాక్షన్ చీకటి కోణాల వెనుక బలి అవుతున్న జీవితాల గురించి ఫ్యాక్షన్ తగాదాల ప్రభావంలేని కోస్తా జిల్లాల సినిమా ప్రేక్షకులకు ఈపాట కనెక్ట్ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతన్నాయి. ఇక నిన్నసాయంత్రం విడుదలైన ‘రెడ్డి ఇటు చూడు’ పాట ఎన్టీఆర్ క్రేజ్‌కు తగినట్టుగా అనిపించి మంచి మాస్ బీట్ లో కొనసాగినా ఈఒక్క పాటమాత్రమే ‘అరవింద సమేత’ ను ఎంతవరకు మోయగలుగుతుంది అన్నఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  
గుండెను పిండేసేలా ‘పెనివిటి' పాట
‘అరవింద సమేత’ కథ చాల ఎమోషనల్ గా కొనసాగుతుంది అని త్రివిక్రమ్ చెపుతున్న నేపద్యంలో ఈసినిమాలో పాటలు కేవలం నాలుగు మాత్రమే పరిమితం చేసారు. అయితే జూనియర్ సినిమా అంటే కనీసం ఆరు పాటలు ఉండాలి అని ఆశించే మాస్ ప్రేక్షకులు ఈనాలుగు పాటల ప్రయోగానికి ఎంతవరకు ఆమోదిస్తారు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నగా మారింది. 
 నాలుగు పాటలేంటి?
అయితే ‘అరవింద సమేత’ సినిమా కథ చాలా ఎమోషనల్‌ గా సాగుతుంది అనీ ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌గా భావోద్వేగాల నడుమ ఈసినిమా సాగుతుందని డైలాగ్స్, యాక్షన్ సీన్లు పిచ్చపిచ్చగా మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా త్రివిక్రమ్ తీసాడని చెపుతున్నారు. ఇన్ని మసాలాల మధ్య పాటలు ఎక్కువైపోతే అసలకు మోసం వస్తుందని త్రివిక్రమ్ ముందు జాగ్రత్తలతో ఈ నాలుగు పాటల ప్రయోగం చేసాడని అంటున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే ఇక రానున్న రోజులలో టాప్ హీరోల సినిమాలలో కూడ పాటలు బాగా తగ్గిపోయే ఆస్కారం ఉంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: