అక్కినేని నాగేశ్వరావు జయంతి సందర్భంగా నిన్నసాయత్రం ఒకనాటి ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ అక్కినేని పాత్రలను పోషిస్తున్న బాలకృష్ణ సుమంత్ లు కలిసి ఉన్న ఒక స్టిల్ ను విడుదల చేసారు. గతంలో ఎన్టీఆర్ ఎఎన్ఆర్ లు ఒకరికొకరు ఆత్మీయంగా సిగరెట్ వెలిగించుకుంటూ సందడిచేసిన ఒక సంఘటనకు సంబంధించిన ఫోటోను యధాతధంగా అలనాటి ఎన్టీఆర్ ఎఎన్ఆర్ గెటప్ లను గుర్తుకు చేస్తూ ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన సీన్ స్టిల్ ను విడుదల చేసారు. 
Poster of NTR biopic
ఇప్పుడు ఈఫోటో మీడియా వర్గాలకు మాత్రమే కాకుండా అక్కినేని నందమూరి అభిమానులకు విపరీతంగా కనెక్ట్ అయింది. అయితే ఈఫోటో విడుదలైన కొన్ని గంటలకే ఈఫోటో పై కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో ఒకనాటి ఎన్టీఆర్ – ఏఎన్ఆర్‌ ల స్నేహాన్ని ఎస్టాబ్లిష్ చేసే సీన్లు ఉంటాయని ఈఫోటో సంకేతాలు ఇస్తున్నా ఎన్టీఆర్ ఏఎన్ఆర్‌ లు వ్యక్తిగతంగా స్నేహంగా ఉన్నప్పటికీ వీరిమధ్య ప్రొఫెషనల్ ఫైట్ కు సంబంధించిన సంఘటనలు కూడ ఈబయోపిక్ లో చూపెడతారా లేదా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. 
NTR Biopic First Poster: Nandamuri Balakrishna Is The Image Of NTR
కొన్ని సంవత్సరాలపాటు ఈఇద్దరి మహానటుల మధ్య గ్యాప్ రావడమే కాకుండా ఈఇద్దరి అభిమానులకు ఒకరంటే ఒకరికి పడేది కాదు. వీరిద్దరి మధ్య వచ్చిన ‘ఇగో’ క్లాషెస్ వల్ల కొన్నిసంవత్సరాల పాటు వీరిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకోవడం మానివేయడమే కాకుండా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక వ్యవహారంలో ఏఎన్ఆర్‌ కు తేడా వచ్చింది అన్నవార్తలు అప్పట్లో సంచలనాలు సృష్టించాయి. అక్కినేని జీవించి ఉన్న సమయంలో ఒకఇంటర్వ్యూలో ఎఎన్ఆర్ ఓపెన్ గానే చెప్పాడు. 

అయితే ఇలాంటి వివాదాస్పద విషయాలు చూపించకుండా కేవలం వారిద్దరి మైత్రి గురించి మాత్రమే ఎన్టీఆర్ బయోపిక్ లో చూపించబోతున్నారని టాక్. ఇప్పటికే ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన వెన్నుపోటు సీన్ లేకుండా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్న నేపధ్యంలో కనీసం ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించిన సంచలన విషయాలు లేకుండా కేవలం ఒక పాజిటివ్ డాక్యుమెంటరీలా ఎన్టీఆర్ బయోపిక్ ను తీస్తున్న నేపధ్యంలో బాలకృష్ణ అన్ని విషయాలలోనూ రాజీ పడిపోతున్నాడు అంటూ అనేక రకాల కామెంట్స్ వినపడుతున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: