తెలుగు నాట కన్నడ బ్యూటీల హడావుడి ఈనాటిది కాదు. అప్పట్లోనే భారతి అందాల తారగా ఓ రేంజిలో ఊపేశారు. తరువాత కాలంలో సౌందర్యానికే  సరి కొత్త అర్ధం చెబుతూ సౌందర్య టాలీవుడ్ ని ఏలేసిన సంగతీ తెలిసిందే. అదే రూట్లో ఎందరో వచ్చారు. ఇక లేటెస్ట్ గా చూసుకుంటే చాలా మంది కన్నడ హీరోయిన్స్ టాలీవూడ్ లో ఎంట్రీ ఇస్తూ కదం తొక్కుతున్నారు. ఇక్కడ హీరోలతో పదం పాడుతున్నారు. సూపర్ హిట్ అనిపించేసుకుంటున్నారు. 



కన్నడ బ్యూటీగా ఈ తరంలో టాలీవుడ్ ని కుదిపేసిన  అందమంటే అనుష్కా శెట్టిదే. ఆ అమ్మాయి సూపర్ అన్న మూవీతో నాగార్జున జోడీగా తెలుగులో ఎంటరైనా విక్రమార్కుడుతో గ్లామర్ మార్క్ చూపించింది. ఆనక అరుంధతిలో అదిరిపోయే హిట్ ఇచ్చేసింది. ఇక బాహుబలి వన్, టూ తో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాటి లేని మేటి హీరోయిన్ అనిపించెసుకుంది.



ఫిదా మూవీతో టాలీవుడ్ నే ఫిదా చేసిన సాయి పల్లవి కన్న కస్తూరీ తిలకమే. ఈ మెడికో పక్కింటి అమ్మాయిలా ఉంటూనే తెలియని అందంతో గుండె తలుపులు తట్టెస్తోంది. చేసినవి కొన్ని మూవీసే అయినా తెలుగు వారు మరచిపోలేని హీరోయిన్ గా ముద్ర వేసుకుంది. ఏమండోయ్ నానీ గారు అంటూ మిడిల్ క్లాస్ అబ్బాయి లో సాయి పల్లవి అందం అలా పల్లవించిన తీరు మరచిపోగలమా..



ఇక నిన్న వచ్చిన్న మరో బ్యూటీ రష్మిక కన్నడ అందమే. చలో అంటూ ఎంట్రీ ఇచ్చి కుర్ర కారు ని తన వెంట తిప్పేసుకున్న ఈ ముద్దు గుమ్మ గీతా గోవిందంలో తన అందంతో అదరగొట్టేసింది. మరి కొద్ది రోజుల్లో రాబోతున్న దేవదాస్ మూవీలో నాని పక్కన జోడీగా మరిన్ని సోయగాలను ఆరబోయనుంది. రష్మిక ఇపుడు తాలీవుడ్ హాట్ ఫావరేట్.



అదే దారిలో మరో చిన్నది నభా నటేష్. నిన్న విడుదలైన నన్ను దోచుకుందువటే మూవీతో తెలుగు యూత్ ని బాగానే దోచేసుకుంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో నభ నటేష్ ఓ రేంజిలో రెచ్చిపోవడం ఖాయమని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: