‘అరవింద సమేత’ ఆడియో పూర్తిగా విడుదల కావడంతో ఆపాటల పై ఇప్పటి వరకు కొనసాగిన సస్పెన్స్ తొలిగిపోయింది. దసరాను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈమూవీకి మరింత క్రేజ్ పెంచడానికి అక్టోబర్ మొదటి వారంలో జరిగే ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురించి జూనియర్ అభిమానులు అత్యంత ఆతృతగా ఎదురు చూస్తునారు. 
Peniviti Lyrical Song from Jr NTR Aravinda Sametha
ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీ పై మరో నెగిటివ్ ప్రచారం ఊపు అందుకుంది. ఈమూవీ కథ కొన్ని చోట్ల కొరటాల శివ దర్శకత్వంలో గతంలో ప్రభాస్ తో తీసిన కథ ఛాయలను పోలి ఉంటుందని అంటూ మరో షాకింగ్ గాసిప్ కు తెర తీసారు. వాస్తవానికి ఇలాంటి గాసిప్పులు లేటెస్ట్ గా రావడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది. 
jr ntr starrer aravinda sametha veera raghava audio released
‘మిర్చి’ సినిమా కథలాగే ‘అరవింద సమేత’ కథ కూడ రాయలసీమ ఫ్యాక్షన్ లో ఉంటుంది అన్న విషయం ఓపెన్ సీక్రెట్. దీనికితోడు ‘అరవింద సమేత’ కు సంబంధించి ప్రస్తుతం హడావిడి చేస్తున్న ‘పెనివిటి’ సాంగ్ పూర్తిగా విన్న వారికి జూనియర్ తల్లి ఈపాట పాడుతూ ఫ్యాక్షన్ ముఠా తగాదాల కోసం గర్బంతో ఉన్న తనను తన పెనివిటి వదిలి వెళ్ళిపోయాడు అంటూ జూనియర్ తండ్రి పాత్ర పోషించిన నాగబాబును గుర్తుకు చేసుకుంటూ ఈ గుండెలు పిండే విషాద గీతాన్ని పాడుతుంది. 
Jr NTR in Aravinda Sametha
‘మిర్చి’ సినిమాలో కూడ ప్రభాస్ తల్లి నదియా ఫ్యాక్షన్ లీడర్ పాత్రను పోషించిన సత్య రాజ్ ప్రవర్తన నచ్చక ప్రభాస్ ను చిన్నతనంలోనే సత్య రాజ్ కు దూరంగా పెంచుతుంది. దీనితో ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా పెంచాలని తల్లి ప్రయత్నించినా ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ తిరిగి ఫ్యాక్షన్ ఊబి లోకి వచ్చినట్లు జూనియర్ కూడ చిత్తూరు ఫ్యాక్షన్ గోడవలలోకి వచ్చిన సందర్భం చూసిన వారికి ‘అరవింద సామెతలో’ ‘మిర్చి’ గుర్తుకు వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ కోసం ప్రెంచ్ మూవీ ‘లార్గో వించ్’ నుండి ప్రేరణ పొందినట్లుగా ‘అరవింద సమేత’ విషయంలో కొరటాల ‘మిర్చి’ నుండి ప్రేరణ పొందాడ అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: