చెన్నై బ్యూటీ అసిన్ ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘శివమణి’ సినిమాల ద్వారా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్టేటస్ కు ఎదిగి, ‘గజినీ’ సినిమాతో దక్షిణ భారతదేశంలో నెంబర్.1 హీరోయిన్ రేసులోకి వెళ్లిపోయింది. అయితే ఆ తరువాత ఈ అమ్మడి దృష్టి బాలీవుడ్ పై పడడం తో టాలీవుడ్, కోలీవుడ్ లను వదులుకొని బాలీవుడ్ కి చెక్కేసి ‘హౌస్ ఫుల్’, ‘రెడీ’, ‘బోల్ బచ్చన్’ లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి, 100 కోట్ల హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. అయితే అక్కడ కూడా అసిన్ హవా మందగించడంతో చేసేది లేక మళ్ళి కోలీవుడ్ కి వచ్చి అటు తమిళంలో ఇటు తెలుగు లో అవకాశాలు వెతుకోవడం మొదలు పెట్టింది.

యంగ్ హీరోయిన్స్ పోటీ హెచ్చుగా ఉండడం, అసిన్ కు వయసు మూడు పదులు ధాటి పోవడం తో ఇక్కడ కూడా ఆమెను పట్టించుకున్న వారు పెద్దగా ఎవరూ లేరు. అయితే అనుకోకుండా మళ్ళీ ఆమె కు బాలీవుడ్ నుంచి పిలుపు రావడం తో అసిన్ నక్కతోక తోక్కిందనే అనుకున్నారు. బాలీవుడ్ మూవీ ‘వెల్ కం బ్యాక్’ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అసిన్ ను వరించింది. మొదటగా ఈ సినిమాలో హీరోయిన్ గా సోనాక్షి సిన్హా ను అనుకున్నా అసిన్ అయితే ఆ పాత్రకు బాగుంటుంది అని ఆ సినిమా దర్శకనిర్మాతలు అసిన్ తండ్రి జోసెఫ్ దగ్గరకు వస్తే తన కూతురు కోటి రూపాయలకు తక్కువ పారితోషికం అయితే చెయ్యదని చెప్పడం తో అదిరిపోయిన ఆ సినిమా నిర్మాణ సంస్థ వారు అసిన్ ను తీసివేసి శ్రుతి దగ్గర వాలిపోయారట.

అదే విధంగా ఈమధ్య కొన్ని సినిమాలకు కోలీవుడ్, టాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నా, అసిన్ తండ్రి జోసెఫ్ మూర్ఖత వల్ల అసిన్ కి వస్తున్న అవకాశాలు అన్నీ ఆవిరి అయిపోతున్నాయని ప్రస్తుతం లేట్ వయసు లో అసిన్ కెరియర్ కు విలన్ గా అసిన్ సొంత తండ్రి జోసెఫ్ మారిపోయాడు అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ విషయాలు చాలా ఆలస్యంగా తెలుసుకున్న అసిన్ మాత్రం జరిగిన నష్టానికి నిర్ఘాంతపోయి ఇక తన వ్యవహారాలు అన్నీ తానే చూసుకోవాలని నిర్ణయి౦చుకుందట. మొత్తం మీద చూస్తే ఆరిపోయే దీపంలా ఉన్న అసిన్ కెరియర్ కు అసిన్ తండ్రి జోసెఫ్ విలన్ గా మారాడు అనుకోవాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: