ఈవారం విడుదల కాబోతున్న ‘దేవదాస్’ మూవీ పై నాని చాల ఆశలు పెట్టుకున్నాడు. గత కొంతకాలంగా నాగార్జున సినిమాలు వరస పరాజయాలు పొందుతున్న నేపధ్యంలో నానీతో కలిసి చేసిన ఈమల్టీ స్టారర్ తనకు ఖచ్చితంగా హిట్ ఇస్తుందన్న నమ్మకంతో నాగార్జున ఈమూవీని చాలభారీగా ప్రమోట్ చేస్తున్నాడు. 
nagarjuna nani multi starrer devadas movie first look release date locked
ఇలాంటి పరిస్థుతులలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ‘దేవదాస్’ టీమ్ చాల వినూత్నమైన ఆలోచనలతో ఈమూవీని ప్రమోట్ చేస్తోంది. ఈవిషయానికి సంబంధించి నాగార్జున తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఒక షాకింగ్ వీడియోను పోస్ట్ చేసి "నన్ను విసిగించే ఫ్రెండ్ దాసు.. మీ ఫ్రెండ్ ను కూడా ట్యాగ్ చేయండి #దేవదాస్ సెప్టెంబర్ 27 న" అని ట్వీట్ చేశాడు. 
‘Devadas’ trailer: Doctor and don come together in this action-comedy starring Nani and Nagarjuna
ఆవీడియోలో న్యాచురల్ స్టార్ నానీకి ఉన్న ఒక విచిత్రమైన అలవాటును బయటపెడుతూ నానీని ఆట పట్టించాడు నాగ్. నానీ ఎప్పుడు తన సెల్ ఫోన్ లో ఎదోఒకటి చూస్తూ చాల బిజీగా కనిపిస్తాడని ఏదైనా మాట్లాడాలని తాను ప్రయత్నిస్తే నానీ ఫోన్ వైపు సీరియస్ గా చూస్తూ  ‘వన్ మినిట్’ అంటాడని దీనితో ఆ ఫోన్ లో ఎప్పుడూ నాని ఏం చూస్తుంటాడో తనకు తెలియదు అంటూ పక్కన ఒక అందమైన అమ్మాయి ఉన్నా కూడా నానీ పట్టించుకోడు అంటూ జోక్ చేసాడు నాగార్జున. 
devadas teaser
ఇప్పుడు నాగార్జున నానీ పై చేసిన ఫన్నీ కామెంట్స్ వైరల్ గా మారడంతో కొందరు నాగార్జున మాటల వెనుక అర్ధాలు వెతుకుతున్నారు. కొంతకాలం క్రితం అమ్మాయిల విషయంలో నానీని టార్గెట్ చేస్తూ కొందరు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆకామెంట్స్ కు డైరెక్ట్ గా నాని సమాధానం ఇవ్వలేకపోయినా నానీ తరపున నాగార్జున ఈవిధంగా సమాధానం ఇచ్చాడు అంటూ నాగార్జున ఫన్నీ కామెంట్స్ వెనుక అర్ధాలను వెతుకుతున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: