‘అరవింద సమేత’ రిలీజ్ డేట్ కు కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో ఈసినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ త్రివిక్రమ్ టీమ్ పరుగులు తీస్తోంది. ఈసినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను కూడ ఇంచుమించు పూర్తి చేసారు. అయితే ఇక్కడే అనుకోకుండా త్రివిక్రమ్ కు పూజ హెగ్డే కు సంబంధించిన షాక్ తగిలింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
‘అరవింద సమేత’ నుంచి ‘అనగనగా…’ లిరికల్ వీడియో…
పూజా హెగ్డే కన్నడ బ్యూటీ కావడంతో ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలకు వేరే డబ్బింగ్ ఆర్టిస్టుల చేత డబ్బింగ్ చెప్పించారు. అయితే ‘అరవింద సమేత’ విషయంలో ఇప్పటికే అనేక ప్రయోగాలు చేస్తున్న త్రివిక్రమ్ పూజ హెగ్డే పాత్రకు వెరైటీగా ఉంటుందని ఆమెతోనే డబ్బింగ్ చెప్పించాడని తెలుస్తోంది. నిజానికి పూజా హెగ్డే తాను తెలుగులో డబ్బింగ్ చెప్పలేనని చెప్పినా త్రివిక్రమ్ లెక్క చేయకుండా వెరైటీ కోసం ఆమె గొంతుతోనే డబ్బింగ్ చెప్పించి డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసారు. 

OMG... SHOCKING - Pooja Hegde's Portions in Junior NTR's 'ARAVINDA SAMETHA' gets LEAKED !?!
వాస్తవానికి ఈసినిమాకు సంబంధించిన తెలుగు డైలాగులు పలకడంలో పూజకు స్వయంగా ట్రైనింగ్ ఇవ్వాలని త్రివిక్రమ్ భావించినా తన పనుల ఒత్తిడి వల్ల ఆపనులను త్రివిక్రమ్ తన సహాయకులకు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ టీమ్ పూజా హెగ్డేకు కోచింగ్ విషయంలో లోపం అనుకోవాలో లేదంటే పూజ సరిగ్గా క్యాచ్ చేయలేక పోయిందో తెలియదు కానీ డబ్బింగ్ ఫైనల్ అవుట్ పుట్ వచ్చేసరికి పూజ పలికిన డైలాగ్స్ వ్రాసిన త్రివిక్రమ్ కే అర్ధంకాని విషయంగా మారినట్లు టాక్.
No Audio Launch for Aravinda Sametha, NTR Fans Disappointed
దీనితో మైండ్ బ్లాంక్ అయిన త్రివిక్రమ్ జూనియర్ సలహాతో ఇప్పుడు పూజా హెగ్డే పాత్రకు వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ చేత డబ్బింగ్ చెప్పిస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా ఈమూవీ నిర్మాత రాథా కృష్ణ ఒక మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ ‘అరవింద సమేత’ జూనియర్ మార్క్ తో ఉండే ఒక మాస్ మసాలా మూవీ అని అన్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈమూవీలో త్రివిక్రమ్ మార్క్ కనిపించదా అంటూ జూనియర్ అభిమానులు బయ్యర్లు ఖంగారు పడుతున్నట్లు తెలుస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: