బిగ్ బాస్ సీజన్ 2 మరో వారం రోజుల్లో పూర్తి కానుంది.  రోజు రోజుకీ ఎంతో ఉత్కంఠంగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 2 జరిగిన వారంపై నాని కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినట్లు తెలిపాడు.  గత కొన్ని వారాల నుంచి జరగని ఎమోషన్, ఫిజికల్ గొడంలు మొన్నటి వారంలో జరిగాయని..ఇలాంటి పరిణామాలు వస్తాయని తాను అస్సలు ఊహించలేదని..ఇంటి సభ్యులు ఏమీ అర్థం కాకుండా ఒకేసారి మాట్లాడటం వల్ల ఎవరి బాధ ఏంటో అర్థం కాక ప్రేక్షకులు కూడా ఎంతో ఇబ్బంది పడ్డారని ఇంటి సభ్యులుకు చురకలు అంటించారు. 

అయితే బిగ్ బాస్ లో శని, ఆదివారాల్లో నాని చేసే హడావుడి తో కాస్త ఎంట్ర టైన్ మెంట్ దొరికింది.  ఆదివారం ఎపిసోడ్ లో ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశాడు నాని. నిమర్జనం సంధర్భంగా నాని మెడలో డోలు వేసుకొని తన డాన్స్ తో ఆకట్టుకున్నాడు. నాని నటించిన 'దేవదాస్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున, రష్మిక, ఆకాంక్ష సింగ్ లు షోకి వచ్చారు. హౌస్ మేట్స్ కి 'దేవదాస్' సినిమా ట్రైలర్ వేసి చూపించారు నాగార్జున. వారు వెళ్లిపోయిన తర్వాత  నాని హౌస్ మేట్స్ ఒక్కొక్కరినీ సొంతంగా క్యాంపైనింగ్ చేసుకోవాలని చెప్పారు.

ఇందులో భాగంగా హౌస్ మేట్స్ ఒక్కొక్కరు ఆడియన్స్ తమకు ఎందుకు ఓట్లు వేయాలనుకుంటున్నారు..? మిగిలిన హౌస్ మేట్స్ కి ఎందుకు వేయకూడదనే విషయంపై చర్చించాల్సిందే..కానీ ఒక్క కౌశల్ మినహా మిగిలిన ఇంటి సభ్యులు ఇతరులను ఎలిమినేట్ ఎందుకు చేయాలో అన్న విషయం చెప్పలేదు.

ఇక ఎలిమినేషన్ విషయానికి వచ్చిన నాని.. హౌస్ మేట్స్ లో ఎవరు ఫినాలేకి వెళ్లబోతున్నారనే విషయాన్ని వెల్లడిస్తూ ముందుగా కౌశల్ పేరు చెప్పారు హోస్ట్ నాని. ఆ తరువాత గీతామాధురి, తనీష్ ల పేర్లు చెప్పి దీప్తి, రోల్ రైడా పేర్లలో ఒకరి పేరు చెప్పడంలో నాని కొంచెం సస్పెన్స్ మైంటైన్ చేస్తూ.. దీప్తి పేరు చెప్పి.. రోల్ ఎలిమినేట్ అయిన విషయాన్ని వెల్లడించారు. ఇక వెళ్తూ వెళ్తూ రోల్ టాప్ త్రీలో కౌశల్, తనీష్, గీతామాధురిలు ఉంటారని చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: