తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు వారసుల హవా కొనసాగుతుంది. అక్కినేని ఫ్యామిలీ నుంచి అక్కినేని నాగార్జున తర్వాత ఆయన కొడుకులు అక్కినేని నాగ చైతన్య, అఖిల్ లు హీరోలుగా కొనసాగుతున్నారు. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజను మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. మంచు ఫ్యామిలీ నుంచి విష్ణు, మనోజ్ లు హీరోలుగా..ఇలా స్టార్ హీరోల తనయులు హీరోలుగా తమ జోరు కొనసాగిస్తున్నారు. అయితే మనం చిత్రంలో ఎండింగ్ లో మెరుపుతీగలా కనిపించిన అఖిల్..తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఈ చిత్రంతో అఖిల్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నా..కమర్శియల్ హిట్ కాలేదు. తర్వాత హలో చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు..ఈ చిత్రం కూడా కమర్షియల్ గా పెద్దగా విజయం సాధించలేదు. తాజాగా ఇప్పుడు తొలిప్రేమ లాంటి డీసెంట్ హీట్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను సినిమాలో నటిస్తున్నాడు అఖిల్. తాతగారి జయంతి సందర్భంగామిస్టర్ మజ్ను’ టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక అమ్మాయిల మనసులు కొల్లగొట్టాలంటే అందం ఒక్కటే సరిపోతు..స్టైల్ తో పాటు ఫిజిక్ కూడా ఎంతో ముఖ్యం.
తాజాగా అఖిల్ సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు. తన సిక్స్ ప్యాక్‌ను పెద్ద అద్దం ముందు నిలబడి సెల్ఫీ తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అఖిల్ సిక్స్ ప్యాక్‌పై స్పందిస్తు.. . నేను రెడీ! షర్టు లేకుండా షూటింగ్ కోసం కాదు. ప్రియమైన నాన్నతో వెకేషన్ కు వెళ్లేందుకు. కానీ ఒక్క క్షణంలో నేనిలా ఉన్నానేంటి అని నాకనిపించేలా చేస్తాడు. అందుకే ఇది నాకు తప్పదు అంటూ ఫన్నీగా పోస్ట్ చేశాడు. ఇక మిస్టర్ మజ్ను సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్ చేస్తున్నారు.