ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఏయన్నార్ లుక్ అందరిని ఆశ్చర్యపరచింది. ఏయన్నార్ గా సుమంత్ అచ్చు గుద్దినట్టు ఉన్నాడని అందరు అంటున్నారు. ఈ లుక్ పై నాగార్జున కూడా ఒక్క హైట్ తప్ప నాన్న గారిలా సుమంత్ సూపర్ అనేశాడు. అయితే ఇదిలా ఉంటే సుమంత్ ఈ లుక్ రావడం వెనుక ఒకరి హస్తం ఉందట.


ఆమె ఎవరో కాదు సుమంత్ సోదరి సుప్రియ అని అంటున్నారు. ఏయన్నార్ తో ఎక్కువ అనుబంధం ఉన్న సుప్రియ ఆయన లుక్ విషయంలో తన దగ్గర ఉన్న రిఫరెన్సులు అన్ని ఎన్.టి.ఆర్ మూవీ దర్శకుడు క్రిష్ కు ఇచ్చిందట. ఇక సుమంత్ కు కొన్ని సలహాలు ఇచ్చిందట.


ఫైనల్ లుక్ తర్వాత యూనిట్ సభ్యులు కొన్ని మార్పులు చెప్పినా సుప్రియ మాత్రం ఈ లుక్ ఓకే అని చెప్పిన తర్వాత సుమంత్ ఏయన్నార్ లుక్ వదిలారట. చిన్నప్పటి నుండి తాత దగ్గరే పెరగడం వల్ల సుప్రియ ఏయన్నార్ లుక్ అంత బాగా వచ్చేందుకు సహకరించింది. సుమంత్ ఏయన్నార్ లుక్ విషయంలో ఆమెను మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.


పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్ గా నటించిన సుప్రియ ఈమధ్యనే వచ్చిన గూఢచారి సినిమాలో స్పెషల్ రోల్ లో నటించింది. ఇక నుండి సినిమాల్లో నటిస్తానని చెబుతున్న ఈ అక్కినేని నటీమణికి ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: