బిగ్ బాస్ సీజన్-2 లో కంటెస్టంట్ లో ఒకడైన కౌశల్ మొదటి నుండి సింగిల్ గా ఫైట్ చేస్తూ స్ట్రాంగ్ కంటెస్టంట్ గా మారాడు. అయితే అతనెప్పుడైతే ఒక్కడు అనే ఫీలింగ్ కలిగిందో బయట ఆడియెన్స్ అతన్ని ఫాలో అవుతూ వచ్చారు. అలా వందలు.. వేల కొద్ది ఫ్యాన్స్ కలిసి కౌశల్ ఆర్మీగా తయారయ్యారు.


కౌశల్ ఇంట్లో చేస్తున్న పనులెలా ఉన్నా కౌశల్ ఆర్మీ సపోర్ట్ మాత్రం బాగా ఉంటుంది. ప్రతి వారం నామినేషన్స్ లో కౌశల్ ఉండటం అతన్ని ఆర్మీ సేఫ్ చేయడం జరుగుతూనే ఉంది. ఇదిలాఉంటే హౌజ్ లో జరిగే గొడవలను సర్ధి చెప్పాల్సిన నాని మీద కూడా కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు.


కౌశల్ ది తప్పైతే తప్పని చెప్పాల్సిన నాని ఈమధ్య తన వాయిస్ తగ్గించాడని టాక్. శనివారం జరిగిన ఎపిసోడ్ లో లాస్ట్ వీక్ కౌశల్ ఇంటి సభ్యులందరిని కుళ్లల్లా మీద పడుతున్నారని అన్నాడు. అయితే అలా అనడం నోరు జారడమే అయినా అతన్ని ఎటాక్ చేసినందుకు కౌశల్ కు సపోర్ట్ గా ఇంట్లో వాళ్ల మీద రివర్ పంచ్ వేశాడు నాని.  


తనీష్ ను అయితే బయటకొచ్చి కౌశల్ మీద చేయి వేయగలుగుతావా అంటూ హెచ్చరించాడు. అయితే ఈ గొడవకి కారణం ఎవరు ఏంటన్నది ప్రస్థావించి ఇంటి సభ్యులందరి తప్పు ఇందులో ఉందని అన్నాడు. అయితే కౌశల్ ను మాత్రం సున్నితనంగా మందలించాడు నాని. హోస్ట్ గా నాని కూడా కౌశల్ ఆర్మీకి భయపడుతున్నాడని అంటున్నారు. అంతేకాదు రిలీజ్ కానున్న దేవదాస్ మీద కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్ పడకూదడని అలా చేస్తున్నట్టు తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: