ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ‘మహానటి’ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్సాఆర్ బయోపిక్ షూటింగ్ లు షరవేగంగా జరుగుతున్నాయి.  ఇవే కాదు త్వరలో కోడీ రాంమూర్తి, కేసీఆర్, చంద్రబాబు బయోపిక్ లు కూడా రాబోతున్నాయి.  తాజాగా తన గానామృతంతో కోట్ల మంది తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన  ప్రముఖ గాయకుడు ఘంటసాల. 

భక్తి గీతాలను .. యుగళ గీతాలను .. విషాద గీతాలను ఏ పాట అయినా సరే ఎప్పటికీ గుర్తుండిపోయాలా పాడటం ఆయనకే చెల్లింది.    కెరియర్ ఆరంభంలో ఘంటసాల ఎన్నో కష్టాలు పడ్డారు. విజయనగరంలో సంగీత సాధన చేసే రోజుల్లో మధూకరం చేసి (జోలె పట్టి ఇంటింటికీ తిరిగి ఆహారాన్ని తెచ్చుకోవడం) పొట్ట పోషించుకున్నారు. అలాంటి ఘంటసాల జీవితచరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

తనకున్న మక్కువతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి ఘంటసాల జీవితచరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఘంటసాల జీవితచరిత్రపై పరిశోధన చేసిన సీహెచ్ రామారావు, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. కాగా,  ఘంటసాల పాత్రలో సింగర్ కృష్ణ చైతన్య నటించనున్నాడు. అలాగే కృష్ణ చైతన్య భార్య మృదుల ఘంటసాల గారి సతీమణి పాత్రలో నటించనున్నారు, వాసురావు సంగీతం అందించనున్న ఈ బయోపిక్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను తెలియజేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: