బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా ఖాన్ ఇందులో ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు.  భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ చిత్రంలోని ఒక్కో పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ లు రిలీజ్ చేస్తున్నారు.   ఇప్పటికే ఈ చిత్రంలో అమితాబ్ ఖుదాభక్ష్‌గా, కత్రినా సురైయ్యగా, ఫాతిమా జఫీరాగా అందరినీ మెప్పించగా.. తాజాగా ఆమిర్ మొదటి లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 

ఈ మూవీలో ఆమీర్ ఖాన్..‘ఫిరంగి’ అనే పాత్రలో గుర్రంపై ఉన్న లుక్‌ను రిలీజ్ చేసారు. ఈ లుక్ కొంచెం ఫన్నిగా కొంటెగా ఉంది. అమితాబ్, ఫాతిమా సనా షేక్‌కు సంబంధించిన ఖుధాబక్ష్, జఫీరా పాత్రలు సీరియస్‌గా లుక్‌లో ఉంటే..సురైయ్యగా కత్రినా లుక్ రొమాంటిక్‌గా ఉంది. లేటెస్ట్‌గా రిలీజైన ఆమీర్ ఖాన్ పాత్ర ఫన్నియస్ట్‌గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

యశ్‌రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్- అతుల్ సంగీతం అందిస్తుండగా.. దీపావళి కానుకగా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కన్‌ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్ అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నాడు. 19వ శతాబ్ధంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఆజాద్ అనబడే తెగ గురించి ఈ చిత్రంలో చూపించనున్నారు.  ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ మూవీని 3డీ, ఐమాక్స్ ఫార్మాట్స్‌లో హిందితో పాటు తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: