‘నేను శైలజ’ సినిమాతో మంచి విజయం అందుకున్న రామ్..తర్వాత వరుసగా ఫెయిల్యూర్స్ చవిచూస్తున్నాడు.  మంచి విజయం ఇప్పుడు తన ఖాతాలో వేసుకోవడానికి..‘సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్’సినిమాలకు దర్శకత్వం వహించిన నక్కిన త్రినాథరావు నమ్మకం పెట్టుకున్నట్టు తెలుస్తుంది.  ప్రస్తుతం హీరో రామ్, మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కుతున్నసినిమా ‘హలో గురు ప్రేమకోసమే’.సెన్సిబుల్, క్యూట్ ప్రేమ క‌థాగా ఈ సినిమా తెరకెక్కబోతుందని చిత్ర యూనిట్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

కొద్ది సేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేశారు.  విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇక అనుపమ హాట్ హాట్ లుకింగ్ పై ఎన్నో కామెంట్స్ కూడా వచ్చాయి. తాజాగా రిలీజ్ అయిన "దూరం దూరం దూరం దూరంగుండే ఆకాశం .. దగ్గరకొచ్చి గారం చేసిందా .., భారం భారం భారం భారం అనుకోకుండా నాతోపాటు భూమిని లాగిందా .. "అంటూ ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుంది.

ఈ పాట యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఓ కుర్రాడి మనసులో ప్రేమ పుట్టినప్పుడు చోటుచేసుకునే సంతోషంలో నుంచి పుట్టినపాటగా ఇది సాగుతోంది.  ఈ పాటలో రామ్ గతంలో కంటే హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఉండగా, అనుపమ మరింత గ్లామరస్ గా అనిపిస్తోంది.  దేవిశ్రీ సంగీతం .. శ్రీమణి సాహిత్యం .. అల్ఫాన్స్ జోసెఫ్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్త చేసుకుని అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకురానుంది ‘హలో గురు ప్రేమకోసమే’. 


మరింత సమాచారం తెలుసుకోండి: