నందమూరి బాలకృష్ణ కెరియర్ లో చాలా వెనుకపడి ఉన్న టైంలో సింహా సినిమా తీసి హిట్ కొట్టాడు బోయపాటి శ్రీను. ఆ సినిమాతో మళ్లీ సింహంలా గర్జించి తన సత్తా చాటాడు బాలకృష్ణ. ఆ తర్వాత మళ్లీ అదే కాంబినేషన్ లో లెజెండ్ సినిమా కూడా వచ్చింది. సింహా హిట్ మేనియా కొనసాగిస్తూ లెజెండ్ కూడా మంచి హిట్ సాధించింది.


ఇక ఈ క్రేజీ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందని కొన్నాళ్లుగా వినిపిస్తున్న వార్తే. అసలైతే బాలయ్య 100వ సినిమానే బోయపాటితో చేయాల్సి ఉంది కాని ల్యాండ్ మార్క్ మూవీ కొత్తగా ఉండాలని క్రిష్ తో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేశాడు. ఇక ఆ తర్వాత కుదరలేదు. ప్రస్తుతం బోయపాటి శ్రీను చరణ్ తో సినిమా చేస్తున్నాడు.


ఆ సినిమా పూర్తి కాగానే బాలకృష్ణ మూవీ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ కూడా 70 కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు. బాలకృష్ణ కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ సినిమా రాబోతుంది. అంతేకాదు పక్కా షెడ్యూల్ ప్రకారంగా ఈ సినిమా 70 రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. 


70 కోట్ల సినిమా 70 రోజుల్లో షూటింగ్ కచ్చితంగా ఇది సంచలనాలు సృష్టించేలా ఉంటుందని నందమూరి ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. సింహా, లెజెండ్ సినిమాల తరహాలోనే ఈ సినిమా మరింత వసూళ్ల హంగామా చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా చేస్తున్న బాలకృష్ణ ఈ సినిమా పూర్తి చేసిన వెంటనే ఆ సినిమాకు ముహుర్తం పెట్టనున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: