ప్రపంచ సినీ ఇండస్ట్రీలో అస్కార్ అవార్డు కి ఎంత గొప్ప పేరు ఉంటుందో అందరికీ తెలిసిందే.  ప్రపంచ వ్యాప్తంగా సినీ ఇండస్ట్రీ వర్గాలు ఆస్కార్ లో అవార్డు కోసం తెగ కష్టపడిపోతుంటారు. కనీసం ఆస్కార్ కి నామినేషన్ అయినా చాలు అనుకునే వారు కూడా ఉన్నారు.  తాజాగా ఇర్ఫాన్ ఖాన్ నటించిన 'దూబ్-నో బెడ్ ఆఫ్ రోజెస్' బంగ్లాదేశ్ తరుపున 2019 సంవత్సరానికి గాను ఆస్కార్ నామినేషన్లకు ఎంపికైంది. బంగ్లాదేశ్ ఆస్కార్ కమిటీ తమ దేశం తరుపున బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఈ చిత్రాన్ని నామినేట్ చేస్తూ ఆస్కార్‌కు పంపారు. ఇర్ఫాన్ ఖాన్ తెలుగు చిత్రాల్లో కూడా నటించారు. 


దూబ్‌ నో బెడ్‌ ఆఫ్‌ రోజెస్‌ చిత్రంలో నటించడంతో పాటు సహ నిర్మాతగా వ్యవహరించారు ఇర్ఫాన్‌. తన కూతురు చిన్ననాటి స్నేహితురాలతో శారీరక సంబంధం కలిగిన ఓ వ్యక్తి కథతో ఈ చిత్రం తెరకెక్కింది.  అప్పట్లో ఈ సినిమాపై బంగ్లాదేష్‌‌లో నిషేదం కూడా విధించారు. ఇపుడు ఇదే చిత్రం ఆదేశం తరుపున ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో నామినేట్ అవ్వడం విశేషం. కొంత చర్చ తర్వాత 2017 అక్టోబర్‌లో దూబ్‌ విడుదలైంది. 2002 నుంచి ఆస్కార్‌కు తమ చిత్రాలను పంపిస్తున్న బంగ్లాదేశ్‌కు ఇప్పటిదాకా ఒక్క పురస్కారం దక్కలేదు.


ప్రస్తుతం కేన్సర్‌ చికిత్స కోసం విదేశాల్లో ఉన్నారు ఇర్ఫాన్‌. దూబ్-నో బెడ్ ఆఫ్ రోజెస్' చిత్రాన్ని మాస్కో, బుసాన్‌, వాంకోవర్‌, షాంఘై చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. బంగ్లాదేశ్‌ నటి రోకియా ప్రాచీ ఇందులో ఇర్ఫాన్‍‌కు జోడీగా నటించారు. ముస్తఫా సర్వార్‌ దర్శకత్వం వహించారు. భారత దేశం నుండి ఆస్కార్ నామినేషన్‌కు 'విలేజ్ రాక్‌స్టార్స్' అనే అసోం చిత్రాన్ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: