మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య తరువాత, హీరో మంచు మనోజ్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలపై నెట్టింట ఓ వర్గం ఆయన్ను ఏకిపారేస్తుండగా, మనోజ్ మరోసారి స్పందిస్తూ, ఓ లేఖను విడుదల చేశాడు. ప్రేమించుకుంటే..చంపేస్తారా అంటూ  ప్రశ్నించాడు.  ఇక ప్రణయ్ ని హత్య చేయించిన అమృత తండ్రిపై ఎన్నో ఆరోపణలు చేశాడు.  అంతే కాదు ప్రణయ్ ని దారుణంగా చంపించిన మారుతీరావు కి మద్దతు ఇచ్చే వాళ్లను కుక్కలతో పోల్చాడు. ఇదిలా ఉంటే..ఇప్పుడు అమృత తండ్రి మారుతిరావుకి మద్దతు పెరుగుతుంది..కన్న ప్రేమను వదులుకోలేక..తనను మోసం చేసిందని..అందుకు కారణం ప్రణయ్ అన్న అక్కసుతోనే..కేవలం తన కూతురు ప్రేమను పొందడానిని మారుతిరావు ఈ ఘాతుకాని పాల్పడ్డాడని..అతను చేయించింది తప్పే అని..అందుకు పశ్చాత్తాప పడుతున్నాడని అతనికి మద్దతు ఇస్తున్నారు. 


ఈ నేపథ్యంలో నిన్న మిర్యాలగూడలో ర్యాలీ కూడా నిర్వహించారు.  ప్రణయ్ విగ్రహ ప్రతిష్టను వ్యతిరేకిస్తున్నారు.అయితే ప్రణయ్ హత్య విషయంలో బాగా రియాక్ట్ అయిన హీరో మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.  దాంతో మంచు మనోజ్ స్పదించి మరో లేఖ పోస్ట్ చేశాడు. తాను ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశానో అర్థం చేసుకోవాలని కోరాడు. పరువు హత్యపై తాను ఓ వీడియోను విడుదల చేస్తూ, పదవ తరగతిలో ఉన్న వారికి కులాలు, హోదా వంటివి తెలియవన్న ఉద్దేశంతో అలా మాట్లాడానని, దాన్ని గుడ్డిగా వ్యతిరేకించ వద్దని విజ్ఞప్తి చేశాడు. 


తాను ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశానో అర్థం చేసుకోవాలని కోరాడు. పరువు హత్యపై తాను ఓ వీడియోను విడుదల చేస్తూ, పదవ తరగతిలో ఉన్న వారికి కులాలు, హోదా వంటివి తెలియవన్న ఉద్దేశంతో అలా మాట్లాడానని, దాన్ని గుడ్డిగా వ్యతిరేకించ వద్దని విజ్ఞప్తి చేశాడు.  ప్రతి ఒక్కరికీ ప్రేమించే వయసు వస్తుందని, ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుంటే, వారి తల్లిదండ్రులు, స్నేహితులు పెద్ద మనసు చేసుకుని మద్దతుగా నిలవాలే తప్ప, హింసాత్మక చర్యలకు దిగరాదని కోరాడు. 


మిమ్మల్ని మీరు ఇడియట్ లుగా చేసుకుని, తనను కూడా ఇడియట్ ను చేయవద్దన్నాడు. మానవత్వం పరిమళించాలని, కులాలు, మతాలు, ప్రాంతాలు హరించుకుపోవాలని అన్నాడు. అంతే కాదు చివరగా..తన కుటుంబాన్ని, తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న వారికి ఓ సూచన చేస్తూ, తనను గౌరవించక పోయినా ఫర్వాలేదని, మహిళలపై గౌరవాన్ని చూపాలని, మీకూ ఓ తల్లి, సోదరి, భార్య, కుమార్తె ఉన్నారన్న సంగతి గుర్తుంచుకోండని లేఖలో పేర్కొన్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: