ప్రస్తుతం ఇండస్ట్రీ టాప్ డైరక్టర్స్ అందరికీ పరుశురామ్ ఐకాన్ గా మారిపోయాడు. ఒక చిన్న డైరక్టర్ కు 10 కోట్ల రెమ్యూనరేషన్ అంటే సాధారణ విషయం కాదు. ‘సోలో’ ‘శ్రీరస్తు శుభమస్తు’ లాంటి చిన్న సినిమాలు చేసిన పరుశురామ్ కేవలం తన మూడవ సినిమా ‘గీత గోవిందం’ కు లాభాలలో వాటా తీసుకుని 10 కోట్లు పారితోషికం అందుకోవడం త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కళ్ళు తెరిపించినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం ‘అరవింద సమేత’ షూటింగ్ విషయంలో బిజీగా ఉన్న త్రివిక్రమ్ ఆసినిమాను చేస్తూనే తన భవిష్యత్ సినిమాలకు సంబంధించి వ్యూహాలు రచించడంలో దర్శకుడు పరుశురామ్ ను ఆదర్శంగా తీసుకున్నట్లు టాక్. జూనియర్ సినిమా ‘అరవింద సమేత’ పూర్తి అయిన వెంటనే పెద్దగా టైమ్ గ్యాప్ ఇవ్వకుండా అల్లు అర్జున్ తో సినిమాను తీయడానికి త్రివిక్రమ్ రంగం సిద్ధం చేసుకున్నాడు. 
Allu Arjun working according to a new strategy
ఈసినిమాకు సంబంధించి ఇప్పటికే స్టోరీ లైన్ చెప్పడంతో పాటు ఈసినిమాను నిర్మించబోయే అల్లు కాంపౌండ్ తో చర్చలు జరిపిన త్రివిక్రమ్ తనకు కూడ ఈసినిమాకు సంబంధించి పరుశురామ్ ఫార్మలా కావాలని అడిగినట్లు టాక్. పారితోషికం ప్రస్తావన లేకుండా తాను తీయబోయే బన్నీ సినిమాకు సంబంధించి జరగబోయే బిజినెస్ లో 25 శాతం వాటా అడిగినట్లు టాక్. 
Allu Arjun all set for his big Tamil debut
త్రివిక్రమ్ అల్లు అర్జున్ ల కాంబినేషన్ ఉన్న క్రేజ్ రీత్యా ఈమూవీకి ఖచ్చితంగా 80 కోట్ల పైచిలుకు బిజినెస్ అవుతుంది కాబట్టి తనకు పారితోషికంగా సుమారు 20 కోట్ల వరకు వస్తుందని త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు. ఒకవేళ అనుకోకుండా అల్లు అర్జున్ మనసు మార్చుకుని త్రివిక్రమ్ తో సినిమా చేయకుండా మరొక దర్శకుడు వైపుకు వెళ్ళిపోయినా త్రివిక్రమ్ ఇప్పటికే కమిట్ అయిన వెంకటేష్ తో తీయబోయే మూవీకి కూడ పరుశు రామ్ ఫార్మలానే వాడుతాడట. ఇండస్ట్రీని ప్రభావితం చేసే టాప్ డైరెక్టర్లకు కూడ చిన్న డైరెక్టర్ పరుశురామ్ ఆదర్శంగా నిలవడం నిజంగా ఒక ఊహించని ట్విస్ట్..  


మరింత సమాచారం తెలుసుకోండి: