అక్కినేని నాగార్జున నట వారసుడుగా ఎదుగుదామని అఖిల్ ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసినా అతడు నటించిన రెండు సినిమాలు ఘోర పరాజయం చెందడంతో అఖిల్ తన మూడవ ప్రయత్నంగా నటిస్తున్న ‘మిస్టర్ మజ్నూ’ పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో నాగార్జున ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల్ కెరియర్ పై చేసిన కామెంట్స్ షాకింగ్ గా మారాయి. 
Nagarjuna
తన కొడుకులు నాగచైతన్య అఖిల్ ల కంటే తాను మానసికంగా చాల చిన్నవాడిని అని చెపుతూ అయితే తన కొడుకులకు సలహాలు ఇచ్చే విషయంలో తాను చాల పెద్దవాడుగా మారి వారికి అనేక విషయాలలో సలహాలు ఇస్తాను అన్న విషయాన్ని బయటపెట్టాడు నాగ్. ఇదే సందర్భంలో తన చిన్న కొడుకు అఖిల్ స్వభావం గురించి మాట్లాడుతూ అఖిల్ కు చాల తొందర ఎక్కువనీ అతడు నటించిన మొదటి సినిమా ‘అఖిల్’ విషయంలో తొందర పడవద్దు అని సలహాలు ఇచ్చినా పట్టించుకోకుండా ఆవేశంగా నటించి మొదటి ప్రయత్నమే ఫెయిల్యూర్ అని పేరు తెచ్చుకున్నాడని అంటూ అఖిల్ తీరు పై తన అసంతృప్తి వ్యక్తపరిచాడు నాగార్జున.
Nagarjuna
ఇదేసందర్భంలో అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ కరణ్ జోహార్ అఖిల్ తో తీయాలని ప్రయత్నిస్తున్న సినిమాకు తాను అంగీకరించలేదనీ ముందుగా అఖిల్ తెలుగులో తనను తాను నిరూపించుకున్న తరువాత బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలి కానీ  ఇలా రెండు పడవల సిద్దాంతం తనకు నచ్చదు అంటూ నాగ్ అఖిల్ దుడుకు నిర్ణయాలపై కామెంట్ చేసాడు. అంతేకాదు సినిమాల విషయంలో అఖిల్ నేర్చుకోవలసింది ఇంకా చాల ఉందని అవన్నీ నేర్చుకోకుండా అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం తనకు ఇష్టంలేదు అంటూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు నాగార్జున. 

ఇక నాగచైతన్య గురించి మాట్లాడుతూ అఖిల్ తో పోల్చుకుంటే చైతన్య చాల కూల్ గా ఉంటాడని ఏవిషయం పై అయినా చాల నెమ్మదిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు అంటూ కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో ప్రస్తుత తరం ఆలోచనలను గురించి మాట్లాడుతూ తాను తన చిన్నతనంలో తనతండ్రి అక్కినేని ఎదుట కూర్చుని మాట్లాడటానికి కూడ భయపడిపోయేవాడిని అంటూ అయితే తన పిల్లలు చైతన్య అఖిల్ లు దీనికి భిన్నంగా ఒకొక్కసారి తననే కూర్చోపెట్టి క్లాస్ పీకుతున్నారు అంటూ తన పిల్లలపై జోక్ చేసాడు నాగార్జున.. 


మరింత సమాచారం తెలుసుకోండి: