తెలుగు ఇండస్ట్రీలో మొదటి సారిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో చేస్తున్న చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 11న ద‌స‌రా శుభాకాంక్ష‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం చిత్రానికి సంబంధించి సాంగ్ చిత్రీక‌రణ జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల థ‌మ‌న్ స్వ‌ర‌ప‌ర‌చిన బాణీలు విడుద‌ల కాగా, ఇవి సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి. 


యూనిట్‌ సభ్యులందరూ కలసి ఎంతో సరదాగా ఈ షూటింగ్ నిర్వహిస్తున్నట్టు ఫొటోలని బట్టి తెలుస్తోంది. స్టైలిష్‌ లుక్స్‌లో కనిపిస్తున్న ఈ ఫొటోలని చూసి అభిమానులందరూ సంబరపడిపోతున్నారు.  ఫోటొల‌ని బ‌ట్టి చూస్తుంటే షూటింగ్ అంతా స‌ర‌దాగా సాగిన‌ట్టు తెలుస్తుంది.  హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, ఈషారెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్నారు.


జ‌గ‌ప‌తి బాబు, నాగ బాబు త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. అరవింద సమేత’ చిత్రంలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నా డని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ రాయలసీమ కుర్రాడు వీర రాఘవ పాత్రలో కనిపించబోతున్నారు. అరవింద పాత్రలో పూజా హెగ్డే నటిస్తోంది. ప్రేమ కథ చుట్టూ జరిగే ఫ్యాక్షన్ సినిమాలా ఇది ఉంటుందని తెలుస్తోంది. 


ఈ సినిమాలో ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్‌కు తగిన విధంగా డైలాగులు, స్క్రీన్ ప్లే డిజైన్ చేశారని టాక్. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న సినిమా కావడంతో `అర‌వింద స‌మేత‌` ద్వారా క‌మెడియ‌న్‌గా రీ-ఎంట్రీ ఇవ్వ‌డానికి ఒప్పుకున్నాడు సునీల్. ఇందులో సునీల్ ఫుల్ లెంగ్త్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడ‌ు. సునీల్-ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చే సీన్లు హైలెట్ అయ్యేలా ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. 


యూనిట్‌ సభ్యులందరూ కలసి ఎంతో సరదాగా ఈ షూటింగ్ నిర్వహిస్తున్నట్టు ఫొటోలని బట్టి తెలుస్తోంది. స్టైలిష్‌ లుక్స్‌లో కనిపిస్తున్న ఈ ఫొటోలని చూసి అభిమానులందరూ సంబరపడిపోతున్నారు. కాగా, వచ్చే నెల 11న ఈ సినిమాని విడుదల చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: