టాలీవుడ్ లో 90వ దశకంలో అగ్ర హీరోల సరసన నటించి దుమ్మురేపిన హాట్ బ్యూటీ రంభ.  తెలుగు, తమిళ భాషలతో పాటు బాలీవుడ్, మలయాళం, భోజ్‌పురి, బెంగాలీ భాషల్లో హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేసింది రంభ. గ్లామరస్ హీరోయిన్‌గా మూడు దశాబ్దాల పాటు వెండితెర మీద తన స్టామినా చూపించిన తర్వాత 2010లో ఇంద్రకుమార్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి 2011లో లాన్య, 2015లో శాషా అనే ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. రంభ అసలు పేరు విజయలక్ష్మి , ఆమె విజయవాడ కి చెందిన వారు..రాజేంద్ర ప్రసాద్ -ఇవివి దర్శకత్వం లో వచ్చిన ” ఆ ఒక్కటి అడక్కు” సినిమాతో ఆమె వెండితెర కి పరిచయమయ్యారు.
Rambha Pregnancy Baby
అప్పట్లో బాలీవుడ్ బ్యూటీ దివ్యభారతి పోలికలు ఉన్నాయని రంభకు మంచి పేరు రావడంతో వరుసగా సినిమా ఛాన్సులు వచ్చాయి. అప్పట్లో మిడ్డీస్, షార్ట్ జీన్స్ వేసుకొని కుర్రాళ్ల మతులు పోగొట్టిన రంభ వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఊంటూ వచ్చారు.  ఆ మద్య భార్యాభర్తల మద్య కొన్ని వివాదాలు రావడం..తర్వాత కలిసిపోవడం జరిగింది.  రాజమౌళి తీసిన ‘యమదొంగ’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన డ్యాన్స్ చేసి మెప్పించింది. 

ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలకు తల్లయిన రంభ, 23 సెప్టెంబర్ ఆదివారం రోజు పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త ఇంద్రకుమార్ పద్మనాభం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియచేశారు.

‘కెనడాలోని మౌంట్ సినాయ్ హాస్పటిల్‌లో ఆదివారం రోజు రంభకు ప్రసవం జరిగింది. తల్లీ బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు...’ అంటూ పోస్ట్ చేశారు ఇంద్రకుమార్. ఆ మద్య కొన్ని డాన్స్ రియాలిటీ షో లకి జడ్జి గా వ్యవహరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: