తెలుగు రాష్ట్ర ప్రజలకు బిత్తిరి సత్తి అంటే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  తీన్మార్ అనే కార్య‌క్రమంతో తనదైన బిత్తిరి న్యూస్ చెబుతూ అందరికీ దగ్గరయ్యాడు.  ఇండస్ట్రీకి నటుడిగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న బిత్తిరి సత్తి పదిహేను సంవత్సరాల వరకు ఎలాంటి పాత్ర లభించలేదు.  కానీ పట్టువదలని విక్రమార్కుడిలా స్టూడియోల చుట్టూ తిరుగుతూ..చిన్న చిన్న పాత్రల్లో నటించడం మొదలు పెట్టాడు. స్వతహాగా మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన బిత్తిరి సత్తి (కావలి రవి)కి బుల్లితెరపై ఆఫర్లు రావడం మొదలయ్యాయి. 

ఆ తర్వాత తీన్మార్ అనే కార్య‌క్రమంతో ఒక్కసారీగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులను సంపాదించాడు.  ఒకదశలో ఆ ఛానల్ కి బిత్తిరి సత్తి యాంకరింగ్ ప్లస్ పాయింట్ అయ్యిందని..తర్వాత వరుసగా వివిధ టివి ప్రోగ్రామ్స్ లో ఛాన్సలు వచ్చాయి.  అంతే కాదు వరుసగా సినిమా ఛాన్సులు కూడా రావడం మొదలయ్యాయి.  తాజాగా బతుకమ్మ ఫేమ్ టి. ప్రభాకర్ దర్శక‌త్వంలో తుపాకి రాముడు అనే సినిమా చేస్తున్నాడు స‌త్తి. 

ఈ సినిమా రసమయి ఫిల్మ్స్ పతాకంపై రసమయి బాలకిషన్ నిర్మాణంలో రూపొందుతుంది. చిత్ర మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌ను ఇటీవ‌ల ప్రముఖ దర్శకుడు సుకుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు.  యూనివర్సల్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అల‌రిస్తుంద‌ని ద‌ర్శ‌కుడు అన్నారు.   ఈ సినిమా అన్ని రకాలుగా కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్ మేలవించి ఉంటాయని చిత్ర యూనిట్ తెలపింది.

ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ప్రియ, ఆర్.ఎస్.నందా, గౌతంరాజు, రవి, ఆదేష్, అంబటి వెంకన్న, అనురాగ్ పోశం, మాధవి, గాయత్రి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి ఛాయాగ్రాహ‌కుడిగా సురేందర్‌రెడ్డి ఉన్నారు. మాటలు: సిద్దార్థ, రవి ఆదేష్, ఎడిటింగ్: జె.పి, పాటలు: అభినయ శ్రీనివాస్, మిట్టపల్లి సురేందర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మక్కపాటి చంద్రశేఖర్‌రావు, మక్బుల్ హుస్సేన్, నిర్మాత: రసమయి బాలకిషన్, రచన, సంగీతం,దర్శకత్వం: టి.ప్రభాకర్.

https://www.youtube.com/watch?time_continue=134&v=D0nJAVZh9qs



మరింత సమాచారం తెలుసుకోండి: