‘అరవింద సమేత’ విడుదల కాకుండానే ఒక కీలక విషయంలో బలహీన పడటం ఈమూవీ బయ్యర్లను కలవర పెడుతున్నట్లు టాక్. ఒకవైపు అక్టోబర్ 2న జరగబోతున్న ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఎదురు చూస్తున్న జూనియర్ అభిమానులకు కూడ ఈబలహీన పడిన వార్తలు షాక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. 
Jr NTR
వాస్తవానికి ఈసినిమాకు సంబంధించి విడుదలైన 4పాటలలో ‘పెనివిటి’ పాటకు కేవలం ఐదు రోజులలో 6 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. అదేవిధంగా ఈసినిమాకు సంబంధించిన మరొక రొమాంటిక్ డ్యూయెట్ అయిన ‘అనగనగా’ కు 6.2 మిలియన్ వ్యూస్ వచ్చినా మొత్తం మీద ‘అరవింద సమేత’ ఆడియో సూపర్ సక్సస్ కాదు అని ట్రేడ్ వర్గాలు తేల్చడంతో పాటు ఈమూవీకి సంబంధించిన అన్ని పాటలకు సంబంధించిన టోటల్ ఆడియోకు ఇప్పటి వరకు 2 మిలియన్ వ్యూస్ మించకపోవడం ఒకవిధంగా మైనస్ పాయింట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
A still from the teaser
దీనికితోడు ఈమధ్య పెద్దహీరోలు లేని చిన్న సినిమాల ఆడియోలకు వచ్చిన వ్యూస్ ‘అరవింద సమేత’ ను మించి ఉండటంతో ఈమూవీ తన మొదటి పరీక్షలో అద్భుతాలు చేయలేకపోయింది అన్న విమర్శలు వస్తున్నాయి. ఈమూవీలోని మరొక పాత ‘ఏ కొనలో కూలినాడో’ పాట ట్యూన్ పై విమర్శలు రావడమే కాకుండా ఈట్యూన్ ఒక తమిళ సినిమా పాటకు కాపీ అన్న ప్రచారం కూడ జరుగుతోంది. 
OMG! People spent 85 billion hours on WhatsApp in 3 months
దీనికితోడు ఈమూవీలో కేవలం నాలుగు పాటలే ఉండటం ఒక మైనస్ పాయింట్ అయితే అందులో రెండు పాటలు సిట్యువేషనల్ సాంగ్స్ కావడంతో ఈపాటల ట్యూన్స్ ఎంత కనెక్ట్ అయినా ఆపాటలను చిత్రీకరించడంలో త్రివిక్రమ్ ఎంతవరకు సక్సస్ అయ్యాడు అన్న విషయం పై ‘అరవింద సమేత’ ఘన విజయం ఆధారపడి ఉంటుంది. జూనియర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ రీత్యా ఈమూవీకి అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే విషయంలో ఎటువంటి సందేహాలు లేకపోయినా ఈమూవీకి టోటల్ పాజిటివ్ టాక్ వచ్చినప్పుడు మాత్రమే అత్యంత భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లు గట్టెక్కుతారు అని ఇండస్ట్రీ వర్గాల టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: