విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ సినిమా ‘నోటా’ పై అలిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి  ఈసినిమాను ఈనెలలోనే విడుదల చేయాలని భావించినా ఈమూవీ రిలీజ్ డేట్ విషయంలో వచ్చిన అయోమయం వల్ల అనేక రిలీజ్ డేట్స్ పరిశీలనకు రావడంతో అక్టోబర్ 18న విడుదల చేయాలని నిర్మాత జ్ఞానవేల్ రాజా చాలప్రయత్నించాడు అని తెలుస్తోంది. 
Vijay Devarakonda's NOTA to release in October?
అయితే ఈప్రయత్నాలకు దిల్ రాజ్ సహకరించక పోవడంతో ‘నోటా’ ను విధిలేక అక్టోబర్ 5న విడుదల చేస్తున్నట్లు టాక్. దిల్ రాజ్ నిర్మించిన సినిమాలు వరస పరాజయాలు పొందుతున్న నేపధ్యంలో అతడి నిర్మాణంలో వస్తున్న ‘హలోగురూ ప్రేమకోసమే’ సినిమాకి ‘నోటా’ పోటీ లేకుండా ఉండటానికి ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు అని అంటున్నారు.
Vijay-Devarakonda
వాస్తవానికి విజయ్ దేవరకొండకు కూడ తన ‘నోటా’ ను అక్టోబర్ 18న విడుదల చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం ఉందట. దీనికి కారణం ‘అరవింద సమేత’ అంటున్నారు. జూనియర్ సినిమా విడుదలకు కేవలం ఆరు రోజుల ముందు ‘నోటా’ ను పోటీగా రంగంలోకి దింపడం ఇష్టం లేకపోయినా దిల్ రాజ్ ఒత్తిడితో ఈ రిలీజ్ డేట్ కు ఫైనల్ చేయడం పై విజయ్ దిల్ రాజ్ పై కూడ ఫీల్ అవుతున్నట్లు సమాచారం. 
Nota Movie Sneak Peek
అయితే విజయ్ తన ఆఖరి ప్రయత్నంగా ఈమూవీ విడుదల డేట్ కు సంబంధించి ట్విటర్ లో పోల్ నిర్వహించినప్పుడు చాలామంది అభిమానులు అక్టోబర్ 18కి ఓటు వేసినా ఇక విదిలేని పరిస్థుతులలో ఈ రిలీజ్ డేట్ కు ఓకె చేసాడని సమాచారం. భారత దేశంలో చదువుకున్న వారు దగ్గర నుంచి చదువురాని వారి వరకు అందరు మాట్లాడుకునే రాజకీయాలు సినిమా క్రికెట్ ల ప్రభావం సమాజం పై ఏవిధంగా ఉంది అన్న విషయాన్ని రాజకీయకోణ నేపధ్యంలో వివరించే ‘నోటా’ సంచలన విజయం సాధిస్తుంది అన్న నమ్మకంతో విజయ్ దేవరకొండ ఉన్నాడు..  


మరింత సమాచారం తెలుసుకోండి: