బోయపాటి బాలకృష్ణల కలయికతో ఇప్పటివరకు వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో వీరిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్ గురించి గతకొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈహ్యాట్రిక్ కాంబినేషన్ కు రంగం సిద్ధం అయినా బాలకృష్ణ బోయపాటికి ఇచ్చిన ‘మిషన్ 70’ టార్గెట్ తో బోయపాటి సతమతమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ప్రస్థుతం బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మొత్తం నవంబర్ చివరకు పూర్తి అవుతున్న నేపధ్యంలో బోయపాటికి బాలయ్య లైన్ క్లియర్ చేసి తన సినిమాను డిసెంబర్ నుండి మొదలు పెట్టమని చెప్పినట్లు సమాచారం. బోయపాటి చరణ్ ల మూవీ షూటింగ్ కూడ నవంబర్ చివరకు పూర్తి అయిపోతున్న నేపధ్యంలో ఈవిషయంలో బోయపాటి తనకు సమస్యలు ఉండవు అని భావించాడు. 
Balakrishna
అయితే బోయపాటి బాలకృష్ణల మూవీ బడ్జెట్ 70 కోట్లు దాటండంతో పాటు ఈమూవీని కేవలం 70 రోజులలో పూర్తి చేయాలని బాలకృష్ణ బోయపాటికి టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నుండి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి మొదలవుతుంది కాబట్టి ఆసమయానికి బోయపాటి ప్రాజెక్ట్ నుండి పూర్తిగా బయటకు రావాలని బాలకృష్ణ ఆలోచనలు చేస్తూ ఇలా 70 రోజులు టార్గెట్ ఇస్తున్నట్లు టాక్. 
Director Boyapati Srinu (Photo: DC)
బాలకృష్ణతో 70 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమా కాబట్టి కేవలం 70 రోజులలో సినిమాను పూర్తి చేయడం కష్టమని దీనికి సంబంధించి మరికొంత సమయం ఇమ్మని బోయపాటి బాలయ్యను అడుగుతున్నట్లు సమాచారం. దీనికితోడు డిసెంబర్ నెలాఖరు నుండి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ప్రమోషన్ తో బోయపాటి చరణ్ మూవీ ప్రమోషన్ తో సంక్రాంతి వరకు బిజీగా ఉంటున్న నేపధ్యంలో బాలయ్య ఇచ్చిన 70 రోజుల టార్గెట్ ను 100 రోజులగా మార్చమని బోయపాటి బాలయ్య పై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: