ఆమె అందగత్తె, నటిగానూ ప్రతిభావంతురాలు. ఎన్నో ఆశలు పెట్టుకుని సినిమా పరిశ్రమలోకి వచ్చింది. మరి ఇక్కడ కాస్టింగ్ కౌచ్ భూతం ఆమెను వెంటాడింది. చివరకు ఆమె కెరీర్నే బలి చేసేసింది. ఆ నటి ఎవరో కాదు మన నందమూరి అందగాడు బాలక్రిష్ణ చాల కాలం క్రితం నటించిన వీరభద్ర మూవీలో జోడీన నటించిన తనుశ్రీ దత్త.


 2005లో వచ్చిన ‘ఆషిక్‌ బనాయా అప్నే’తో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. హాట్ హాట్ సీన్లలో నటించారు. కానీ దాదాపు ఐదేళ్లకే ఆమె కెరీర్ మధ్యలోనే అగిపోయిందని లేటెస్ట్ గా తనుశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో కాస్టింగ్ కౌచ్ అంటే ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదని, తాను నోరెత్తి బయటకు చెప్పడం వల్ల తనకే  అవకాశాలు లేకుండా చేశారని తనుశ్రీ అంటోంది.



హార్న్‌ ఓకే ప్లీజ్’ అనే హిందీ మూవీలో సోలో సాంగ్‌ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ సమయంలో ఓ నటుడు వచ్చి నా చెయ్యి పట్టుకుని లాగాడు. వద్దని వారించినా నీకు డ్యాన్స్ నేర్పిస్తానంటూ పదేపదే నన్ను అసభ్యంగా తాకాడు. కొరియోగ్రాఫర్, ఇతర సిబ్బంది చూస్తూ ఉండిపోయారు కానీ నాకు సాయం చేయలేదు. ఈ విషయాన్ని తాను మీడియాకు వివరించడంతో కెరీర్ నాశమైందని’ తనుశ్రీ అంటున్నారు. 



అసభ్యంగా వేధిస్తున్నారని తాను గొంతెత్తి అరచిన నాడు సినిమా పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదని తనుశ్రీ దత్తా వాపోయారు. పైగా తన అవకాశాలను కూడా దెబ్బ తీశారని అన్నారు. ఇప్పటికైనా కాస్టింగ్ కౌచ్ పై అంతా బయటకు రావడం మంచిదేనని, మహిళలు కూడా హ్యాపీగా పనిచేసేలా సినిమా రంగం ఉంటే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. మొత్తానికి కాస్టింగ్ కౌచ్ చీకటి కోణలెన్నూ ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: