అందం అంటే ఏంటి అన్నది సందేహం. కానీ చూసే కనులుంటే ఎక్కడైన అందమే. ఇక ఆడవళ్ళ అందం గురించి చెప్పలంటే కవులకే కాదు, ఆ దేముడికైనా అసాధ్యమే. అందమంటే అంతా బయట ఆరేసుకోవడమేనని అనుకుంటున్న ఈ రోజుల్లో కూడా యైటీస్ ట్రెండ్ బ్యూటీగా ఉంటూ అలరిస్తోంది. ఫుల్ ట్రేడిషనల్ లూక్ తో ఉండే ఆ చిన్నది నటనలో మేటి. 



ఈ మధ్యన సాయి పల్లవి అసలు కనిపించడంలేదని అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. ఫిదా మొవీతో యువతను తన వైపు తిప్పుకున్న ఈ అమ్మడు ఆ తరువాత నానితో కూడా మిడిల్ క్లాస్ అబ్బాయి చేసి సూపర్ జఒడీ అనిపించేసింది. ఇక కణం మూవీతో అత్యుత్తమ నటనను కనబరచి మరో సౌందర్య అనిపించేసుకుంది. అయితే ఆ మూవీ ఫ్లాప్ కావడంతో సాయి పల్లవి నెక్స్ట్ మూవీ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.



ప్రస్తుతం సాయి పల్లవి.. శర్వానంద్ పక్కన  పడిపడి లేచే మనసు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హను రాఘవపూడి లాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ పూర్తవుతోంది. సాయిపల్లవి ఇందులో కోల్ కత్తాకు చెందిన మెడిసిన్  విద్యార్థిగా నటిస్తోంది. అక్టోబర్ తో చిత్రీకరణ పూర్తి చేసి డిసెంబర్ 21న సినిమాని రిలీజ్ చేయనున్నారు. చిత్రీకరణలో బిజీగా ఉండడం వల్లనేమో.. సాయిపల్లవి సందడి ఇటీవల మిస్సయ్యిందని అభిమానులు భావిస్తున్నారు.




మొత్తానికి ఈ మూవీతో మంచి హిట్ కొట్టాలని అటు శర్వానండ్, ఇటు సాయిపల్లవి రెడీ అయిపోతున్నారు. ఈ మూవీతో మళ్ళీ ఫిదా చేయాలని సాయి పల్లవి చూస్తూంటే ఎపుడెపుడా అని అభిమానులు ఇక్కడ వైటింగ్.


మరింత సమాచారం తెలుసుకోండి: