తెలుగు ఇండస్ట్రీలో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సీరీస్ ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.  ఈ చిత్రం కోసం రాజమౌళి ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు.  ఈ చిత్రంతో ప్రభాస్, రానా లకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.  బాహుబలి 2 తర్వాత ఇప్పటి వరకు రాజమౌళి ఏ చిత్రం కూడా తీయలేదు.  ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సంసిద్దం అవుతున్నారు.  ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్దం చేస్తున్నారు.  ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా చేశారు. 

రాజమౌళి తన తదుపరి చిత్రం   బహుబలికి మించి ఉంటుందనే అనుకుంటారు.  అందుకే రాజమౌళి తెలుగులో క్రేజీ మల్టీస్టారర్ కు శ్రీకారం చుట్టాడు.  ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండడంతో రాజమౌళి అది గ్రహించి కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. డిసెంబర్ లో స్టార్ట్ అవుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు మూడు నెలలు మాత్రమే టైం ఉన్నది. ఇక బాహుబలి సమయంలో రాజమౌళితో పనిచేసే అవకాశం చేజార్చుకున్న రచయిత బుర్ర సై మాధవ్ ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ సినిమాకు పనిచేయబోతున్నాడు. 

ట్విస్ట్ ఏంటంటే..ఈ చిత్రానికి సంబంధించిన కథ ఈ హీరోలకు ఇంకా చెప్పలేదని టాక్ వినిపిస్తుంది. ఇందులో గ్రాఫిక్స్ కి పెద్దగా చోటు ఉందని మొదట ప్రచారం జరుగుతున్నప్పటికీ.... ఇందులో గ్రాఫిక్స్ చాలా కీలకం కానున్నది అని తెలుస్తుంది. అందుకు గాను కొన్ని గ్రాఫిక్స్ కంపెనీలతో రాజమౌళి మాట్లాడుతున్నారు.

ఈ చిత్రానికి ఎంత లేదన్నా రెండు సంవత్సరాలు టైమ్ కేటాయించాల్సి వస్తుందని..అందుకే చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ 2020 సమ్మర్‌ వరకు మరే చిత్రాలకి డేట్స్‌ ఇవ్వడం లేదని టాక్ వినిపిస్తుంది. అంతే కాదు ఇప్పటికే మిట్ అయిన చిత్రాలకి వీరిద్దరూ అడ్వాన్సులు తిరిగి ఇచ్చేసినట్టు సమాచారం. ఇప్పటికే మగధీర చిత్రంతో రాంచరణ్ కి..స్టూడెంట్ నెం.1, సింహాద్రి,యమదొంగ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఎన్టీఆర్ కి అందించారు రాజమౌళి.  మరి ఇంత త్యాగం చేస్తున్న ఈ ఇద్దరు హీరోలకు మళ్లీ ఏ రేంజ్ లో విజయాన్ని అందిస్తారో రాజమౌళి అంటూ ఫ్యాన్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: