టాలీవుడ్ లో ఇప్పుడు యంగ్ హీరోల్లో మంచి ఫామ్ లో కొనసాగుతుంది ఎవరంటే వెంటనే చెబుతారు..విజయ్ దేవరకొండ.  పెళ్లిచూపులు సినిమాతో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న విజయ్ తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు.  ఈ సినిమాలో బోల్డ్, అగ్రెసీవ్ గా కనిపించిన విజయ్ దేవరకొండ ఈ మద్య పరుశరామ్ దర్శకత్వంలో వచ్చిన ‘గీతాగోవిందం’సినిమాలో ఎంతో సాఫ్ట్ గా రాముడు మంచి బాలుడు లా కనిపించాడు.  ఈ రెండు వేరియేషన్స్ తో టాలీవుడ్ లో విజయ్ దేవరకొండకు ఒక్కసారే స్టార్ ఇమేజ్ పెరిగిపోయింది. 

అంతే కాదు ఈ సినిమా పెద్ద స్టార్ల రేంజ్ లో వంద కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. ఆ మద్య గీతాగోవందం సినిమా ఫ్రీరిలీజ్ ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి తాను అర్జున్ రెడ్డి, గీతాగోవిందం సినిమాలు చూశానని..రెండు సినిమాల్లో విజయ్ దేవరకొండ చూపించిన వేరియేషన్స్ తనను ఎంతగానో ఇంప్రెస్ చేశాయని మెచ్చుకున్నాడు.  ప్రస్తుతం విజయ్ దేవరకొండ కు తెలుగు, తమిళ భాషల్లో వరుసగా ఛాన్స్ లు వస్తున్నాయి.

తెలుగు లో వరుస విజయాలు అందుకున్న విజయ్ దేవరకొండ తమిళనాట కూడా క్రేజ్ తెచ్చుకుని మార్కెట్ పెంచుకునే ఆలోచనలో వున్నాడు.  అందులో భాగంగానే ఆయన 'నోటా' సినిమా చేశాడు. ఈ రెండు భాషల్లోను ఈ సినిమా వచ్చేనెల 5వ తేదీన విడుదల కానుంది. రాజకీయాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై విజయ్ దేవరకొండ గట్టి నమ్మకంతో వున్నాడు.

ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ కూడా రిలీజ్ కి సిద్దంగా ఉంది.  ఇదిలా ఉంటే.. తెలుగు .. తమిళ భాషల్లో సూర్య కథానాయకుడిగా సుధా కొంగర ఒక సినిమాను రూపొందించనుంది. ప్రస్తుతం చేస్తోన్న సినిమాలు పూర్తి కాగానే సూర్య ఈ ప్రాజెక్టుపైనే దృష్టిపెట్టనున్నాడు. ఇది మల్టీస్టారర్ మూవీ అని..ఇందులో మరో హీరోగా విజయ్ దేవరకొండను తీసుకోవాలని అనుకుంటున్నాట్లు కోలీవుడ్ టాక్.  


మరింత సమాచారం తెలుసుకోండి: