తెలుగు ఇండస్ట్రీలో దేవదాసు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ తర్వాత నటించిన ‘రెడీ’ తప్ప ఏ చిత్రం పెద్దగా విజయం అందుకోలేదు.  ఆ మద్య రామ్, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘నేను శైలజ’మంచి విజయం అందుకొని మనోడికి కాస్త బూస్టింగ్ ఇచ్చినా..తర్వాత వచ్చిన సినిమాలు మల్లీ ఫ్లాప్ అయ్యాయి.  ప్రస్తుతం త్రినాధరావు దర్శకత్వంలో దర్శకత్వం లో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరో గా 'హలో గురు ప్రేమ కోసమే ' చిత్రం రూపొందించబడుతుంది. ఈ చిత్రంలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ ఒక హీరోయిన్ గా , ప్రణీత సుభాష్ మరొక హీరోయిన్ గా కనిపించబోతున్నారు.

అక్టోబర్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ చిత్రంలో రామ్ ఒక హుషారైన పాటను పాడినట్టుగా తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ప్రోత్సాహంతో రామ్ ఒక పాట పాడి తనలోని సింగర్ ని ప్రేక్షకుల కు పరిచయం చెయ్యబోతున్నారు.  ఈ పాట ని ఇప్పటికే రికార్డింగ్ ని పూర్తి చేసుకున్నారట. ఈ చిత్రంలో రామ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నారు.
Image result for hello guru prema kosame
ఈ మద్య రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. తెరపై రామ్ చాలా హుషారుగా ఉంటాడు.. తాను తెరపై కనపడుతున్నంతసేపు ప్రేక్షకులకి ఎంతమాత్రం బోర్ కొట్టకుండా చూసుకుంటాడు.ఈ పాటకు మంచి మార్కులు పడితే .. ఎన్టీఆర్ మాదిరిగానే అడపాదడపా రామ్ తన గొంతును సవరించుకునే అవకాశం వుంది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో రామ్ వున్నాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: