నేడు సమంత, ఒక పేరున్న హీరోకి భార్య మాత్రమే కాదు, ఒక ప్రతిష్ఠాత్మక కుటుంబానికి కోడలు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా చిత్రసీమలో ప్రవేసించిన హీరోయిన్ కు మల్లే టాలీవుడ్ లో ఒక పెళ్ళైన హీరోయిన్ కు తాను కోరుకున్న సినిమాలు రావడం అదీ మరీ గ్లామర్ సినిమాలైతే చాలా కష్టం.  చైతూతో పెళ్లికి ముందే ఎగ్రీ అయిన రంగస్థలం చిత్రాన్ని పెళ్లయ్యాక పూర్తి చేసినా, సమంతకి ఆ చిత్రంతో ఆదరణ దక్కటం వరకు గొప్ప అదృష్టమే. అయితే తనకి గతంలో లాగా తెలుగులో పెద్ద సినిమా హౌజెస్ నుంచి పిలుపులు మాత్రం రావడం లేదు. 
 
సమంత ను హీరోయిన్‌ గా తీసుకుందాం అని దర్శక నిర్మాతలు ప్రోత్సహించినా, చాలా మంది హీరోలు వద్దని అనేస్తున్నారట. దానికి వారికి చైతన్యతో వున్న స్నేహం కావచ్చు, నాగార్జునపై ఉన్న గౌరవం కావచ్చు. అలాగే అక్కినేని ప్రతిష్ఠాత్మక కుటుంబం ఇంటి కోడలుతో మరీ ఇంటిమేట్ దృశ్యాలున్న సినిమాల్లో నటించటం ఎబ్బెట్టు గా అనిపించైనా ఉండవచ్చు. కారణాలు సవాలక్ష.  కాని సమంత చేసే పాత్ర గౌరవ పూర్వకంగా అనిపిస్తే ఆమెని తీసుకోవచ్చని, సాధారణ  గ్లామరస్‌ రోల్స్‌కి సమంత కాకుండా వేరే అవకాశాలను చూడాలని హీరోలు తేల్చి చెప్పేస్తు న్నారట. నిర్మాతలు కూడా పెళ్లయిన సమంతపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదని చిత్ర నగరి టాక్‌. 

అయితే నాగచైతన్య సమంత టాలీవుడ్ సూపర్ జంట గా పెళ్ళికి ముందు నుంచే ప్రతిష్ఠ  కొట్టేసింది. వీరిరువురు విడివిడిగా నటించిన యూటర్న్-శైలజారెడ్డి అల్లుడు సినిమాలు రిలీజ్ కావడంతో కాస్త ఫ్రీ అయిన సమ్మూ-చైతూ జోడీ ప్రస్తుతం హాలీడేస్‌ ను ఎంజాయ్ చేస్తున్నారు. గ్యాప్ దొరికింది కదా! అని విదేశాలకు ఎగిరి పోయారు. సమంత-చైతూతో అఖిల్ కూడా వెళ్లాడట. పెళ్లైనప్పటి నుంచి నాగచైతన్య - సమంత అటు సినిమా కెరీర్‌ ను ఇటు ఫ్యామిలీ లైఫ్‌ ను చాలా బ్యాలన్సుడ్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఎంజాయ్‌మెంట్‌ కి కూడా గ్యాప్ ఇవ్వకుండా వృత్తికి న్యాయం చేస్తున్నారు.

అందుకే కాస్త గాప్ దొరకగానే విదేశీ ట్రిప్-ప్లాన్ చేసిన ఈ జంట వీకెండ్స్‌ లో పబ్‌ కి వెళ్లి ఎంజాయ్ చేశారట. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.  ఈ ఫోటోలను సమంత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది అనుకున్నా, ఒక ఫొటోలో సమంత చైతూ ను హగ్ చేసుకొని మంచి రొమాంటిక్ కిస్ ఇచ్చినట్లు ఉంది. 

ఆ ఫొటో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 'మై రే ఆఫ్ లైట్ చైతు' అని సమంత క్యాప్షన్ ఇచ్చిన విధానం నెటిజన్స్‌ను ఆకట్టుకుంది. ఇక మరో ఫొటో లో చైతు తమ్ముడు అఖిల్‌ తో గంతులేస్తూ కనిపిస్తున్నట్లు ఉంది.  ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మరోవైపు సమంత మాత్రం పెళ్లి తర్వాత కూడా తన గ్లామర్‌ తగ్గలేదనే భావన అభిమానుల ముందు ప్రదర్శించడానికే గ్లామర్ ఒలకబోస్తూ ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోందన్నట్లు కనిపిస్తుంది.  నాకేం పర్లేదు నేనింకా గ్లామర్ డాల్నే అనుకొంటూ తొలి వివాహ దినోత్సవాన్ని అందరికి గుర్తు చేస్తూ ఆమె చైతూతో ఉన్న మోష్ట్ ఇంటిమేట్ పోష్టింగ్స్ సైతం తనను తాను తన పడిపోతున్న మార్కెట్ ను పెంచేసుకోవటానికేనని అంటుంది ఫిల్మ్ నగర్.  ఆమె అంతరంగంలో వివాహం వృత్తి నాశాయః అని దిగులు పడుతున్నట్లుంది చూసేవారికి. 

ఎంత గ్లామర్ ఒలకబోసినా మన హీరోలు సాంప్రదాయికంగా ఉంటూ అదేమీ పట్టించుకోవడం లేదనిపిస్తుంది.  అందుకే భారీ సినిమాలలో అవకాశాలు దాదాపుగా తగ్గడం తో  'యూ టర్న్‌' లాంటి చిన్న చితక సినిమాలు గాని, నటిగా తనకి పేరు తెచ్చిపెట్టే సినిమాలని గాని చేయాలని సమంత అక్కినేని నిర్ణయించుకుందట. పెళ్లయిన తర్వాత కూడా టాప్‌-ప్లేస్ లో కొనసాగుతోన్న బాలీవుడ్‌ హీరోయిన్ల మాదిరిగా ఇక్కడి హీరోయిన్లు అదే క్రేజ్‌ ని మెయింటైన్‌ చేసుకోవడం ప్రతిష్ఠాత్మక కుటుంబాల కోడళ్ళకు కష్టమే కదా! అదీ అక్కినేని లాంటి పేరు ప్రఖ్యాతులు న్న కుటుంబానికి కోడలైన తరవాత అసలే సాధ్యం కాకపోవచ్చు.


అయితే తెలుగు హీరోయిన్ల‌లో స‌మంత రూటే సెప‌రేటు అన్నట్లు నాగ చైతన్యతో పెళ్ళైన కొత్తలో పెళ్లికి ముందు ఎలాంటి హిట్స్ ఇచ్చిందో, పెళ్లికి తరువాత కూడా అదే రేంజ్లో హిట్స్ ఇచ్చింది. గ్లామర్ డోస్ ను ఏ మాత్రం తగ్గించడం లేదు.  కాని ఆ తరవాతే పరిస్థితుల్ల మార్పు వచ్చినట్లుంది. సాధార‌ణంగా పెళ్లి అయిన త‌ర్వాత గ్లామ‌ర‌స్‌గా క‌నిపించేందుకు ఏ హీరోయినూ ఇష్ట‌డ‌ప‌డ‌దు. అయితే స‌మంత మాత్రం ఇందుకు మిన‌హాయింపు. స‌మంత పోస్ట్ చేసిన ఈ ఫోటో సోష‌ల్ మీడియా లో వైర‌ల్‌గా మారింది. మాన‌సిక ప్ర‌శాంత‌త‌ అంటూ స‌మంత‌ పోస్ట్ చేసిన ఈ ఫోటో నాలుగు గంట‌ల్లోనే దాదాపు ఐదు ల‌క్ష‌ల లైకు ల‌ను సాధించింది.
 
అయితే పెళ్ళి తరవాత కూడా చిత్ర సీమలో యధావిధిగా ముందుకు సాగాలన్న సమంత తాపత్రయానికి గండి పడకుండా ఉండాలనే కోరుకుందాం. కాని ఈ బహిరంగ విపరీత శృంగార ప్రదర్శన ఆ కుటుంబ కోడలికి శ్రేయోదాయకమా? అని సమంతే ఆలోచిస్తే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: