మూడంటే మూడే సినిమాలతో స్టార్డం తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తెలుగు తమిళ భాషల్లో నటించిన సినిమా నోటా. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో విజయ్ పొలిటిషియన్ గా కనిపిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.


ఆనంద్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కె.ఇ జ్ఞానవెల్ రాజా నిర్మించారు. అక్టోబర్ 5న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో తేడా కనబడుతుంది. స్టార్ హీరోలకు ధీటుగా యూత్ లో ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ తెలుగులోనే కాదు తమిళంలో కూడా నోటాతో సత్తా చాటాలని చూస్తున్నాడు.


అయితే అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఈ సినిమాకు తగినంత ప్రమోషన్స్ చేయట్లేదు అన్నది తెలుస్తుంది. కచ్చితంగా విజయ్ కెరియర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం మూడు సినిమాలు ఒక దానికి మించి ఒకటి హిట్ అందుకుంది. అందుకే విజయ్ కు మరింత క్రేజ్ ఏర్పడింది.


నోటా సినిమా తెలుగులో విజయ్ క్రేజ్ దృష్ట్యా సినిమాను ఇక్కడ డబ్బింగ్ రైట్స్ అదిరిపోయాయట. దాదాపు నోటా ప్రీ రిలీజ్ బిజినెస్ 30 కోట్ల దాకా పలికాయని తెలుస్తుంది. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విజయ్ కెరియర్ లో ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: