ఒక సినిమా ప్రమోషన్ కోసం మీడియాను పిలిచినప్పుడు ఆసినిమా విశేషాల గురించి మాత్రమే మాట్లాడుతారు. అయితే దీనికి భిన్నంగా ‘దేవదాస్’ సినిమా ప్రమోషన్ మీడియా మీట్ అంటూ మీడియా వర్గాలను పిలిచి నాని తన అప్ కమింగ్ మూవీ ‘జెర్సీ’ గురించి ఎక్కువగా మాట్లాడటం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనితో ఆమీడియా మీట్ ‘దేవదాస్’ మీడియా మీట్ అనుకోవాలా లేకుంటే ‘జెర్సీ’ ప్రమోషన్ మీట్ అనుకోవాలా అంటూ కొందరు మీడియా ప్రతినిధులు కామెంట్స్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
క్షణం తీరిక లేకుండా ఉన్నా
ఈమీడియా మీట్ లో నాని మాట్లాడుతూ తన కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా ‘జెర్సీ’ నిలిచిపోతుందంటున్నాడు. ఈసినిమా కోసం గట్టిగా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నానని కొన్నాళ్ల తర్వాత కొత్త నానీని చూస్తారని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు రోజుకు మూడున్నర గంటల పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేయడం వల్ల చమటలు పడుతున్నాయి అంటూ తను పడుతున్న కష్టాన్ని వివరించాడు నాని.
నాలుగు నెలల్లో హాలీడే లేదు
వచ్చేనెల విజయదశమి రోజున ప్రారంభంకాబోతున్న ఈమూవీలో ఒక కొత్త నానీని చూస్తారు అంటూ తనకు చిన్నతనంలో క్రికెట్ పెద్దగా టచ్ లేకపోయినా ‘జెర్సీ’ కోసం మరోసారి బ్యాట్ పట్టుకోవాల్సి రావడంతో ప్రొఫెషనల్ క్రికెటర్ దగ్గర కూడా లేనంత క్రికెట్ ఎక్విప్ మెంట్ తన ఇంట్లో ఉంది అని అంటున్నాడు. ఇదే సందర్భంలో నాని మరొక ట్విస్ట్ ఇస్తూ రానున్న రోజులలో జరగబోయే సినిమా స్టార్స్ క్రికెట్ పోటీలలో తాను స్టార్ బ్యాట్స్ మెన్ గా రాణించడం ఖాయం అని అంటున్నాడు. 
రెండు రోజులు అని అనుకుంటే
ఇక ఈసినిమాలో తన స్టయిల్ స్టాండింగ్ రిథమ్ బాడీ లాంగ్వేజ్ స్లాంగ్ ఇలా ప్రతిది కొత్తగా కనిపిస్తుందని అంటూ నాని తనను తాను ‘దేవదాస్’ మీడియా మీట్ లో ప్రమోట్ చేసుకున్నాడు. ఇంకా ‘దేవదాస్’ రిజల్ట్ రాకుండానే నాని తన కొత్త సినిమా గురించి విశేషాలు వివరించడంతో ‘దేవదాస్’ విశేషాలు కొద్దిగా పక్కకు జరిగాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: