క్రేజీ హీరోగా విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని మారుతి ప్రయత్నిస్తూ ఉన్నా విజయ్ స్పందించడం లేదు అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే ఆ మూవీ ప్రాజెక్ట్ విషయం తేలకుండానే దర్శకుడు మారుతి విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం షాకింగ్ న్యూస్ గా మారింది. 
vijay devarakonda taxi wala teaser Latest 2018 - Sakshi
మారుతి ఒకవైపు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు సినిమాలను సమర్పించడం ఇతర దర్శకులకు కథలు అందించడం తనే నిర్మాతగా మారి సినిమాలు నిర్మించడం లాంటి పనులు ఇప్పటికే చేస్తున్నాడు. అయితే మారుతి నిర్మాణంలో వచ్చిన సినిమాలు అదేవిధంగా మారుతి కథ అందించింది వేరే దర్శకులు తీసిన సినిమాలు చాలమటుకు ఫెయిల్ అయ్యాయి. 

అయితే మారుతి ఇంకా తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈకోవలో మారుతి నుండి మరొక సినిమా రాబోతోంది. ఆసినిమా పేరు ‘భలే మంచి చౌక బేరము’ మారుతి ఇచ్చిన 'డిఫరెంట్' కాన్సెప్ట్ ఆధారంగా ఈసినిమా తీయబదిందని వార్తలు వస్తున్నాయి. పూర్తిగా మారుతిని ముందుపెట్టి ప్రచారం చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 5న థియేటర్లలోకి రాబోతోంది.
nota
ఇదే డేట్ కు ఇప్పుడు విజయ్ దేవరకొండ ‘నోటా’ కూడ విడుదలకు రెడీ అవుతోంది. అయినా మారుతి విజయ్ దేవరకొండ మ్యానియాను లెక్క చేయకుండా తన ‘భలే మంచి చౌక బేరము’ సినిమాను చాల తక్కువ రేట్లకు బయ్యర్లకు అమ్మి విజయ్ ‘నోటా’ తో పోటీగా వస్తుండటంతో ఈమూవీలో ఏముంది అన్న చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ‘శైలజా రెడ్డి అల్లుడు’ తో భంగ పడ్డ మారుతి విజయ్ దేవరకొండ మ్యానియాను ఎలా తట్టుకుని నిలబడతాడో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: