గత వారం విడుదలైన సుధీర్ బాబు 'నన్ను దోచుకుందువటే' మూవీకి విమర్శకుల ప్రశంసలు లభించినా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడ ఈమూవీని అభినందించినా కలక్షన్స్ పరంగా ఈమూవీ ఏమాత్రం నిలదొక్కుకోలేక పోయింది. అయినా ఈవిషయాలను పట్టించుకోకుండా సుధీర్ బాబు ఈమూవీకి సక్సస్ మీట్ ను నిర్వహించబోతున్నాడు. 
Nannu Dochukunduvate
ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మహేష్ రాలేకపోయిన నేపధ్యంలో ఆలోటును పూడ్చుకోవడానికి ఈమూవీ సక్సస్ మీట్ కు మహేష్ ను అతిధిగా పిలవడమే కాకుండా మహేష్ చేత ఈసినిమాలో నటించిన నటీనటులకు సాంకేతిక నిపుణులకు సన్మానాలు చేయించబోతున్నాడు సుధీర్ బాబు. దీనితో కలక్షన్స్ లేని సినిమాకు సక్సస్ మీట్ ఏమిటి అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
'Nannu Dochukunduvate' Review & Rating {3/5}
ఈసినిమా విజయం ఎలా ఉన్నా నిర్మాతగా సుదీర్ బాబుకు ఇది తొలి ప్రయత్నం కావడంతో నిర్మాతగా తాను ఫెయిల్ అయ్యాను అని ఒప్పుకునే స్థితిలో సుధీర్ బాబు లేడు. దీనికితోడు అన్నీ అనుకూలిస్తే సుధీర్ బాబు మహేష్ తో ఒక సినిమాను నిర్మించి తాను కూడ ఒక భారీ సినిమాకు నిర్మాతగా మారాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో సుధీర్ బాబుకు మానసిక ధైర్యం కలిగించడానికి మహేష్ ఈమూవీ సక్సస్ మీట్ కు అతిధిగా రాబోతున్నాడు అనుకోవాలి. 
Big Boss Anthem
ఈమూవీ ఫెయిల్ అయినా హరీష్ శంకర్ దర్శకత్వంలో త్వరలో ప్రారంభం అయ్యే ఒక మల్టీ స్టారర్ మూవీలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న నేపధ్యంలో హీరోగా అదేవిధంగా నిర్మాతగా తన పోరాటం కొనసాగుతుంది అన్న సంకేతాలు ఇవ్వడానికే సుధీర్ బాబు మూవీ సక్సస్ మీట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వినికిడి. ఈవిషయాలను పక్కకు పెడితే ఈమూవీ డైరక్టర్ నాయుడుకు అదేవిధంగా హీరోయిన్ నభాకు ఈమూవీ తరువాత వరసపెట్టి అవకాశాలు వస్తున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: