ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అధికార పార్టీ చేస్తున్న దురాఘతాలు ప్రజలకు తెలియజేయడానికి ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికి ‘ప్రజా సంకల్పయాత్ర’ మొదలు పెట్టారు.  గతంలో తన తండ్రి ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాద యాత్ర స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు చేరువ అయ్యేందుకు తండ్రిబాటలో పయణిస్తున్నారు.  అలుపెరుగని యోధుడిగా..వేసిన అడుగు వెనక్కి వేయకుండా..ఇప్పటి వరకు ఆయన 3000 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు.  ఎక్కడికి వెళ్లినా..తమ రాజన్న మళ్లీ వస్తున్నాడని..జగన్ ని అక్కున చేర్చుకుంటూ..నిరాజనాలు పలుకుతున్నారు ప్రజలు. 

ఎక్కడికి వెళ్లినా..త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, మీ కష్టాలు తీరుతాయని వారికి భరోసా ఇస్తున్నారు జగన్ మోహన్ం రెడ్డి.   ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్ర సందర్భంగా ఎంతో మంది ప్రముఖులు జగన్ కలసి తమ మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే.  తాజాగా, ఎస్.కోట మండలంలో జగన్ ను ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డిలు కలిశారు. మీ వెంట మేము కూడా ఉన్నామంటూ జగన్ కు తమ మద్దతును ప్రకటించారు.

అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రజల కోసం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను మీడియాలో చూస్తున్నానని... పాదయాత్రలో తాను కూడా భాగస్వామిని కావాలనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చానని చెప్పారు.  ఎండా..వానా లెక్క చేయకుండా 3000 వేల కిలోమీటర్లు పాద యాత్ర చేయడం అంటే సామాన్య విషయం కాదని..ఆయన పట్టుదల చూస్తూంటే..వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వస్తున్నారని..ప్రజలు జగన్ మోహన్ రెడ్డి సంకల్పానికి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.  అచ్చిరెడ్డి మాట్లాడుతూ, జగన్ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ఒక గొప్ప సంకల్పంతో జగన్ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. ప్రజల అండదండలతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: