భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో ఏఆర్ రహమాన్ ఒకడు అన్న విషయం ఎవరు కాదనలేని నిజం. ఆస్కార్  అకాడమీ అవార్డు నుండి    ఎన్నో పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న రహమాన్ కీర్తి ప్రపంచవ్యాప్తం కొన్ని విదేశీచిత్రాలకు కూడా రహమాన్ సంగీతం అందించాడు.  ఈనేపధ్యంలో మణిరత్నం తాజా చిత్రం ‘నవాబ్’ కు సంగీతం అందించిన రహమాన్ ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఈమధ్య హైదరాబాద్ రావడం జరిగింది. 

ఈసందర్భంగా రహమాన్ కొన్ని   మీడియా సంస్థ ప్రతినిధులకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ సందర్భంలో ఒక మీడియా సంస్థ ప్రతినిధి  రెహమాన్ ను ‘సైరా’ నుండి మీరు ఎందుకు బయటకు వచ్చారనే ప్రశ్నకు తీవ్ర అసహనాన్ని వ్యక్త పరిచినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈవిషయం పై ప్రశ్నలు తప్ప వేరేవి ఏవైనా అడగండి అని
ఆమీడియా సంస్థ ప్రతినిధికి రెహమాన్ చురకలు అంటించడం హాట్ టాపిక్ గా మారింది. 

 ఇదే ఇంటర్వ్యూలో  మణిరత్నంతో అనుబంధం గురించి అడిగినప్పుడు స్పందిస్తూ అది మాటల్లో చెప్పలేని అనుబంధం అంటూ మణి రత్నంకు  ఏమి కావాలో  తనకు  అర్థం అవుతుంది. అలాగా  తానూ  ఎలాంటి ట్యూన్స్ కంపోజ్ చేయగలనో మణిరత్నంకు తెలుసు అంటూ వారిద్దరి అనుబంధం పై కామెంట్ చేసాడు.  
Untitled
అంతేకాదు  మిగతా దర్శకుల సినిమాలులా కాకుండా మణిరత్నం సినిమాకు మొదట ట్యూన్స్ కంపోజ్ చేసిన తర్వాతే లిరిక్స్ యాడ్ అవుతాయి అన్న సీక్రెట్ బయటపెట్టాడు. ఇక తెలుగులో స్ట్రెయిట్ సినిమా ఎప్పుడని అడిగితే ఆవిషయం గురించి స్పందిస్తూ ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రతిష్టాత్మక మూవీ అయితే మాత్ర్రమే తాను సంగీత దర్శకత్వం వహిస్తానని తనకు చాల విషయాలు కుదరాలి అంటూ తన ప్రత్యేకతను మరొకసారి బయట పెట్టుకున్నాడు రెహమాన్..  


మరింత సమాచారం తెలుసుకోండి: