ఈ మద్య సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాగా పెరిగిపోయిందని నటీమణులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.  ఇక్కడే కాదు హాలీవుడ్ లో సైదం ఈ విషయంలో పెద్ద ఉద్యమమే నడుస్తుంది.  తెలుగు నటి శ్రీరెడ్డి మొన్నటి వరకు కాస్టింగ్ కౌచ్ గురించి ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే.  ఇండస్ట్రీల చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టులను అతి దారుణంగా వాడుకుంటారని..పక్కలోకి వస్తేనే ఛాన్సులు ఇస్తారని ఆరోపించింది.  శ్రీరెడ్డి విషయంలో కొంత మంది హీరోయిన్లు ఏకీభవిస్తే..కొంత మంది విభేదించారు. 

ఇదిలా ఉంటే..బాలీవుడ్ నటి తనుశ్రీ  ప్రముఖ నటుడు నానా పటేకర్ పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.  అప్పట్లో నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని..ఆ విషయంలో తనకు ఎవరూ సపోర్ట్ చేయలేదని వ్యాఖ్యానించింది.  తాజాగా ఈ విషయంపై చాలా మంది నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ప్రస్తుతం థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమా ప్రమోషన్స్‌లో అమితాబ్, అమిర్‌ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మీడియా అమితాబ్‌ను నానా పటేకర్ విషయంలో తనుశ్రీ అభియోగాలపై మీరేమంటారు? అని ప్రశ్నించగా.. ‘‘నేనేమైనా తనుశ్రీనా? లేదంటే నానా పటేకరా? ఇద్దరినీ కాదు కాబట్టి మీ ప్రశ్నకు నేనెల సమాధానమివ్వగలను? అని తిరిగి ప్రశ్నించారు.

ఇదే ప్రశ్న పక్కనే ఉన్న అమిర్‌ను ప్రశ్నించగా..‘‘ఈ విషయమై నిజానిజాలు తెలియకుండా కామెంట్ చేయడం సరైంది కాదు. ఒకవేళ జరిగి ఉంటే మాత్రం అది విచారించదగిన విషయమే’’అని తెలిపారు. ఏది ఏమైనా నానా పటేకర్ ఓ సామాజిక సేవా కార్యకర్త, నటుడు..ఈ మద్య కాలా సినిమాలో రజినీకాంత్ తో నటించాడు..అలాంటి వ్యక్తిపై ఇప్పుడు ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసం అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: