ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సంబంధించి ప్రతి ఒక్కటీ రిలీజ్ కి ముందు లీకేజ్ అవుతూ..నానా హంగామా సృష్టిస్తున్నాయి.  గతంలో ఏ హీరో అయినా థియేటర్లో చూసే వరకు ఇలా ఉంటారా అన్న ఫీలింగ్ లో అభిమానులు ఉండేవారు..కానీ ఈ మద్య లోకేషన్ స్పాట్ నుంచి ఫోటోలు లీక్ కావడంతో ఓహో..ఈ సినిమాలో హీరో ఇలాగే ఉంటారని ముందే తెలిసిపోవడంతో దర్శక, నిర్మాతలు తలలు పట్టుకునే పరిస్థితికి వస్తుంది.  ఆ మద్య సాహూ సినిమా నుంచి కొన్ని ఫోటోలు లీక్ కావడంతో..ఫస్ట్ లుక్ పై అంత థ్రిల్ పోయింది. 

ఇక రజినీకాంత్ నటిస్తున్న 'పెట్ట' మూవీ కి సంబంధించిన కొన్ని ఫోటో లీక్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో మాఫియా డాన్‌గా న‌టిస్తున్నాడు సూప‌ర్ స్టార్. ప‌గ‌లు హాస్ట‌ల్ వార్డెన్‌గా.. రాత్రిపూట డాన్‌గా రెండు అవ‌తారాల్లో న‌టిస్తున్నాడు ర‌జినీకాంత్. ఇది "బాషా"కు సీక్వెల్ అనే ప్ర‌చారం కూడా త‌మిళ‌నాట జ‌రుగుతుంది. అస‌లే ఈ మ‌ధ్య వ‌ర‌స‌గా మాఫియాపై ర‌జినీకు మోజు బాగా పెరిగిపోయింది. "క‌బాలి".. "కాలా".. ఇప్పుడు "పెట్ట" కూడా ఇదే జోన‌ర్‌లో వ‌స్తుంది.

కార్తిక్ సుబ్బ‌రాజ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల‌తో పోలిస్తే ఇది చాలా భిన్నంగా అనిపిస్తుంది.  ప్రస్తుతం లక్నోలో జరుగుతున్న షూట్‌లో బిజీగా ఉన్న తలైవా.. మోహన్‌లాల్ గంజ్‌లోని పురాతన శివుడి ఆలయం దగ్గర విలన్లతో ఫైట్‌లు చేస్తున్నారు. తలైవా తొలిసారి లక్నోలో షూటింగ్‌కి వెళ్లడంతో.. ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. 

రజినీకాంత్ లుక్ చూస్తుంటే..ర‌జినీ వ‌య‌సు 68 అంటే ఎవ‌రైనా న‌మ్ముతారా..? అస‌లు కుర్రాడిలా  కనిపిస్తున్నారని ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. సినిమా షూటింగ్ జరుగుతుండగా స్థానికుడొకరు ఆ దృశ్యాలను చిత్రీకరించాడు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ మూవీ తెరకెక్కిస్తుండంగా.. ఈ సినిమాలో రజినీ పక్కన హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: