సాధారణంగా స్టార్ హీరోలకు అభిమానుల ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే.  కొన్ని సార్లు వారి అభిమానం హద్దులు దాటితే..అక్కడ వారు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు.  తమ అభిమాన హీరో పలనా ప్రదేశానికి వచ్చాడని తెలిస్తే..అభిమానులు గుంపులు గుంపులుగా రావడం అక్కడ హడావుడి చేయడం జరుగుతుంది.  ఆ మద్య సూర్య కాకినాడ థియేటర్ కి వస్తే..అభిమానుల తాడికి తట్టుకోలేక వెనుక గేటు వైపు నుంచి పారిపోయిన విషయం తెలిసిందే.   ఇలాంటి సమస్యనే తాజాగా తమిళ ఇళయదళపతి విజయ్ ఎదుర్కొన్నారు. 

ఇక అభిమానులు అంటే ఎంతో విలువ ఇచ్చే విజయ్ కి ఓ పెళ్లిలో చేదు అనుభవం ఎదురైందట.  దాంతో ఇక ముందు తాను ఏ పెళ్లికీ వెళ్లనని శపథం చేశాడట. అసలు విషయానికి వస్తే..ఇటీవల పాండిచ్చేరిలో ఓ పెళ్లికి హాజరైన ఇళయదళపతి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తమ అభిమాన హీరో విజయ్ ఆ పెళ్లికి వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో రావడం..తొక్కిసలాట జరగడం జరిగిపోయిందట. 

ఆ సమయంలో విజయ్ కి కూడా స్వల్ప గాయాలు అయ్యాయట.  అయితే తనకు గాయాలైనా పరవలేదు..కానీ అక్కడ పెళ్లిలో చాలా గందరగోళం జరిగిందట. పెళ్లికి సంబంధించిన వారి కుటుంబీకులంతా ఇబ్బందులనెదుర్కొన్నారట. దీంతో విజయ్ ఇకపై ఏ పెళ్లికీ వెళ్లకూడదు అని విజయ్ డిసైడ్ అయ్యాడట.  తన వల్ల ఏ కుటుంబం కూడా ఇబ్బందులు పడకూడదని అనుకుంటున్నాడట.  ఒకవేళ మరీ అంతగా అభిమానులు కోరితే..కొత్త జంటను తన ఇంటికి పిలిపించుకొని దీవించి..వారికి మంచి బహుమానం  ఇచ్చి పంపించాలని అనుకుంటున్నట్లు  సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: