చంద్రబాబు నాయుడు గాని, ఈ ఆర్టికల్లో కనిపించే చోటా కె నాయుడుగాని - నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ అనుభవం అంటూ - అనుభవం పేరు చెప్పి వ్యవస్థల పై తమ పట్టు ప్రదర్శిస్తూ  చెసే తమాషా వ్యవస్థలను అవస్థల పాలు చేస్తుంది తప్ప - తమ ప్రోడక్టు లోని "ఇంగువ గట్టిన గుడ్డ వాసనలు పోనట్లు, పాత చింతకాయ పచ్చడే" వినియోగదారులకు అందిస్తుంది వీరి అచ్చమైన స్వచ్చ అనుభవం.

 

ఫ్రష్నెస్ తాజాదనం నూతనత్వం సృజనాత్మకత అనేవి రాజకీయ రంగంలో గాని, సినిమా రంగంలో గాని, వ్యవహారాలను కొత్త పుంతలు తొక్కించగలవు. సినిమాల గుభాళింపులు కావాలంటే అనుభవం అంతర్లీనం గా ఉంటే మంచిదే కాని ఆధిక్యత ప్రదర్శిస్తేనే అసలు ఇబ్బంది. నవ్యత కావాలంటే కొత్త నీటికి దారివ్వల్సిందే.  కొత్తవారి లోని తాజా వెలుగును, మైమరపించే మెరుపును ఇలాంటి వారు గుర్తించరు సరికదా! కనీసం గమనించరు కూడా! ఇలాంటి వారిని  భరించాల్సి రావటం మన ఖర్మ.



అయినా ఏదో మూల సినిమా పరిశ్రమలో రవి కానని చోట అన్నట్లు నూతనత్వం ఉద్భవించి, కొత్త దర్శకులు తాజా వెలుగుల దీప్తిని ప్రదర్శిస్తారనటానికి పెళ్ళిచూపులు, గీత గోవిందం లాంటి సినిమాలు చాలు — తమ సత్తా చాటటానికి. ఎందుకంటే ఈ పాత చింతకాయపచ్చడి గాళ్ళనీడ కూడా వాళ్ళమీద పడలేదు కాబట్టి తమ ప్రతిభా పాటవాలతో  చిత్ర పరిశ్రమకే విజయాలు తీరాలు చూపించారు.


Image result for chota k naidu bellamkonda srinivas cinema

అయితే తోలి హిట్టు కొట్టిన కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం నేడు ఆసక్తి చూపుతున్నారు.  కారణం ఫ్రష్నెస్,  తాజా సుగంధాలు, నవ్యతలోని సుమసౌరభాలు, సృజనాత్మక ఐడియాలు ఎవరూ తెరవని అద్భుతాల ద్వారాలు తెరుస్తున్నారు.



అందుకే నిర్మాతలకు గీత గోవిందం ₹50 కోట్లకు పైగా ఆదాయం సంపాదించి పెట్టింది. ఇంత సంపద నిర్మాతకు అందించిన సినిమాలు టాలీవుడ్ లో పది కూడా ఉండవని అంటున్నారు నిజాయతీగా విశ్లేషించగల విశ్లేషకులు చెప్పిన మాట.




అయితే పాతవాళ్లతో అంటే ఈ సోకాల్డ్ అనుభవఙ్జులతో-కొత్తగా చిత్ర పరిశ్రమకు వచ్చే దర్శకుల కు మొదట్లో ఇలా ధారుణ ర్యాగింగ్ తప్పట్లేదనే వాదన ప్రచారంలో ఉంది. ముఖ్యంగా సోకాల్డ్ అనుభవం ఉన్న నిర్మాతలు, కెమెరా మెన్, హీరోల ఆధిపత్యాన్ని చాలామంది కొత్త దర్శకులు భరించాల్సిందే. ఈ అనుభవ పటాటోపం ఇందుగల దందు లేదని సందేహం వద్ధు సర్వత్రా వ్యాపించే ఉంది. 


Image result for chota k naidu bellamkonda srinivas cinema

తాజాగా ఒక కొత్త దర్శకుడు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడని సమాచారం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నూతన దర్శకుడు శ్రీనివాస్ ఒక సినిమాను తన దర్శకత్వంలో రూపొందిస్తున్నాడు. దీనికి కెమెరామెన్ గా సినీ పరిశ్రమలో పాతుకు పోయిన సుధీర్ఘ అనుభవమున్న చోటా కే నాయుడు వ్యవహరిస్తున్నాడు.


ఆయనకి చిత్ర సీమలో ఉన్న పేరు ప్రతిష్టల గురించి పెద్దగా ప్రత్యేకంగా వివరించక్కర్లేదు.  ఆయనకున్న అనుభవం తన సినిమాకు ఎంతో ప్రయోజనం అవుతుందనుకున్న నూతన దర్శకుడు శ్రీనివాస్ కి ఇప్పుడు దర్శకత్వం ప్రక్కనబెట్టి  కొత్త తలనొప్పులు ఎదుకోవాల్సివస్తుందనేది సమాచారం.



దర్శకునిగా తనఆలోచనలను, ప్రణాళికలను పక్కనపెట్టి చోటా కే నాయుడుగారి సొంత తెలివి తేటలతో ఆయనకు నచ్చినట్లు గా  సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట. ఇలాంటప్పుడు వచ్చే ప్రోడక్ట్ పాత చింతకాయ  పచ్చడే.
Mehreen in Bellamkonda Sai Sreenivas film
దర్శకుడు శ్రీనివాస్ అడ్డుపడితే, మన చోటా తన కురుచ బుద్దులు పోనీయ కుండా "నా అనుభవం ముందు నువ్వెంత?"  అన్నతీరులో వ్యవహరిస్తున్నట్లు  వినికిడి. ఈ విషయాలన్నీ హీరో నిర్మాత వరకు చేరాయో? లేదో? దానికి సమాచారం లేదు.  అనుభవం అంటూ సొల్లు కార్చే వాళ్ళు, కొత్త వాళ్ళు అందించే తాజా ఐడియాలు ఇవ్వలేరు! ఆస్వాదించనూ లేరు. 
Image result for chota k naidu new Director Srinivas sai srinivas hero
అనుభవం పేరుతో అణచివేస్తే ప్రేక్షకులకు శిరోవేదన నిర్మాతకు ఋణవేదనతప్పదు చివరకు కొంపమునిగిపోవటం ఖాయం. అనుభవఙ్జుడు తన అనుభవాన్ని తాజాదనానికి పాలలో పంచదారలా పంచాలి గాని ఫొటోకి ఫ్రేములా ఉండకూడ దని మనవి.   

Image result for chota k naidu new Director Srinivas sai srinivas hero

ఈయన అనుభవాలు గొప్పవేకావచ్చు....వాటినుండి ఆయన నేర్చుకున్న పాఠాలేమిటో? ... ఈ వీడియో చూస్తే తెలు స్తుంది. పాపం! దర్శకుడు శ్రీనివాస్ ఎవరో గాని ఆయనకు జేజేలు. ఇంకా మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా సంగతి ఆ దేవుడే చెప్పాలి! వయసు, అనుభవంతో కొంచెం సంస్కారం కూడా ఉంటే మంచిది ఇలాంటి వాళ్లకి!


ఈయనగారి అనుభవంలోని అపార విఙ్జానసారం వీడియోలో వీక్షిస్తే పరిశ్రమ భవిష్యత్ దృశ్యం మీకళ్ళలో కదలాడు తుంది.


తారాతోరణం: బెల్లంకొండ శాయి శ్రీనివాస్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హర్హవర్ధన్ రానే, పోసాని కృష్ణ మురళి, సత్యం రాజెష్, అపూర్వ తదితరులు


సాంకేతిక నిపుణులు:  నిర్మాణ సంస్థ: వంశధార క్రియేషన్స్ దర్శకత్వం: శ్రీనివాస్ నిర్మాత: నిర్మాత: నవీన్ శొంటినేని సంగీతం: ఎస్ ఎస్ తమన్ సినిమాటోగ్రాఫర్: చోట కె నాయుడు సాంగ్స్: చంద్రబోస్   

Image result for vamsadhara creations movie

మరింత సమాచారం తెలుసుకోండి: