గత కొద్దిరోజులుగా సమంత పై మాటల దాడి పెరిగి పోవడంతో తన విమర్శకులకు ధీటైన సమాధానం ఇస్తూ మిడిల్ ఫింగర్ ను చూపెడుతూ నిన్న సమంత తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. ఈ ఏడాది ప్రారంభం నుండి వరస విజయాలతో దూసుకుపోతూ తన లేటెస్ట్ ‘యూటర్న్’ మూవీకి కూడ ప్రశంసలతో పాటు విజయం దక్కడంతో ప్రస్తుతం సమంత తన భర్త నాగచైతన్యతో విదేశాలలో ఎంజాయ్ చేస్తోంది.

కొద్దిరోజుల క్రితం సమంత చాల గ్లామరస్ గా కనిపిస్తూ రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని చాల ఎక్స్ పోజింగ్ గా కనిపిస్తూ ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోకు అభిమానుల నుంచి విపరీతమైన లైక్స్ వస్తే విమర్శకులు మాత్రం సమంతను టార్గెట్ చేస్తూ చాల పరుష పదాలను వాడారు. 
Image may contain: 1 person, smiling, close-up and indoor
పేరు ప్రఖ్యాతలు ఉన్న అక్కినేని కుటుంబానికి కోడలుగా కొనసాగుతున్న సమంత ఇలాంటి డ్రెస్ లు వేసుకుని ఎక్స్ పోజింగ్ ఏమిటి అంటూ ఘాటైన సెటైర్లు వేసారు. అయితే ఈ కామెంట్స్ అన్నింటికి ఒకేసారి సమంత సమాధానం ఇచ్చింది. పెళ్ళి తరువాత తాను జీవితంలో ఎలా జీవించాలో తెలుసుకోవడానికి తాను ఎవరి దగ్గరా సలహాలు తీసుకోవలసిన అవసరం లేదనీ అయినా సలహాలు ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ తన మిడిల్ ఫింగర్ ను చూపెడుతూ ‘కృతజ్ఞతలు’ అన్న ఫోటోను పోస్ట్ చేసింది. 
Image may contain: 1 person
దీనితో సమంత తనపై విమర్శించిన వారిని బెదిరిస్తోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఒక స్త్రీ తన జీవితంలో ఎవరితోనైనా ఎలాగైనా ఉండవచ్చు అంటూ అత్యున్నత న్యాయస్థానాలు తీర్పు యిచ్చిన నేపధ్యంలో సమంత తనకు నచ్చిన విధంగా డ్రెస్ చేసుకోవడమే కాకుండా తనకు నచ్చిన విధంగా ఎక్స్ పోజ్ చేసే విషయంలో విమర్శించే హక్కు ఎవరికీ లేదు అన్న విషయం అందరికీ తెలిసిన నిజం..  


మరింత సమాచారం తెలుసుకోండి: