సమంత బికినీ డ్రెస్ గురించి అక్కినేని అభిమానులు నెట్ లో రేగా ట్రోలింగ్ చేస్తున్నారు. పెళ్లి టైమ్ లో గోవాలో బికినీ ఫొటోలతో హల్ చల్ చేసిన సమంత.. వాటిని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి సంచలనమే సృష్టించింది. అక్కినేని వారింటి కోడలికి ఇది పద్ధతేనా అంటూ చాలామంది ట్రోల్ చేశారు. అయితే వాటికి అంతే గట్టిగా బదులు చెప్పింది శామ్. బీచ్ లో బికినీ వేసుకోక చీరకట్టుకోమంటారా అంటూ అటువైపు నుంచి సమాధానమొచ్చింది. 

Image result for samantha latest beach

పెళ్లైన తర్వాత శామ్ లో బాగా మార్పొచ్చిందని అనుకున్నారంతా. ఏ సినిమా ఫంక్షన్ కి అయినా, ప్రైవేట్ ప్రోగ్రామ్ అయినా ఈమె డ్రస్సింగ్ హందాగా ఉండేది. కానీ ఇప్పుడు మరోసారి చిట్టిపొట్టి డ్రెస్సులు వేసింది సమంత. అక్కినేని ఫ్యామిలీ ట్రిప్ లో భాగంగా ఐబిజా ఐలాండ్ లో దిగిన ఫొటోలను మరోసారి ఇన్ స్టాలో పోస్ట్ చేసి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది.

Image result for samantha latest beach

ఎండలో సేదతీరుతూ కురుచ దుస్తుల్లో బికినీ కంటే కాస్త ఎక్కువ ఫొటోలకు ఫోజులిచ్చింది. అంతవరకు బాగానే ఉంది. అయితే విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నానంటూ ట్యాగ్ లైన్ పెట్టి మరీ వీటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంపై చాలామంది మండిపడుతున్నారు. ఇక్కడ నీట్.. అక్కడ హాట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. గ్లామర్, సెక్సీనెస్ పై మరీ అంత యావ ఉంటే పెళ్లి ఎందుకు చేసుకోవడమని విమర్శిస్తున్నారు. పద్ధతి, సంప్రదాయం అంటూ క్లాస్ పీకుతున్నారు. అయినా మొగుడు నాగచైతన్యకు లేని కష్టం జనాలకు ఏమొచ్చిందో. 

మరింత సమాచారం తెలుసుకోండి: