‘బిగ్ బాస్ 2’ షో కంటెస్టెంట్ కౌశల్ ఫాలోయర్స్ కు మంచు మనోజ్ కు మధ్య జరిగిన మాటల యుద్ధం హాట్ టాపిక్ గా మారింది. నాని పేరు చెపితే మండిపడిపోతున్న కౌశల్ అభిమానులు ఏఒక్క విషయం తమకు తెలిసినా నానీని టార్గెట్ చేయకుండా వదలడం లేదు.
బిగ్ బాస్ హౌజ్ లో కౌశల్ ఒంటరిపోరాటం.. అందరు అతన్నే టార్గెట్ చేశారు..!
ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో లేటెస్ట్ గా కౌశల్ అభిమానులు  నాని నాగార్జునతో కలిసి నటించిన చిత్రం 'దేవదాస్' ను చూడొద్దని కూడా ఒక ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇలాంటి పరిస్థుతులలో మనోజ్ ‘దేవదాస్’ సినిమా హీరోలు నాగార్జున నానీలను అభినందిస్తూ పెట్టిన ట్విట్ కౌశల్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించింది. 

"దేవ్ అండ్ దాస్ థ్రిల్లింగ్ కాంబో! ఈ ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడటం ఆనందంగా ఉంది. రోజు రోజుకు యంగ్ గా మారుతున్న నాగార్జున గారికి..  నాని బాబాయ్ కి .. దేవదాస్ టీమ్ అందరికీ బెస్ట్ విషెస్" అని ఒక ట్వీట్ చేశాడు మనోజ్. ఈ విషయం పై కౌశల్ ఆర్మీ మండి పడి మనోజ్ ను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. "ఏం థ్రిల్లింగ్ భయ్యా... మీరు ఈ కామెంట్స్ చేసి మా కౌశల్ అభిమానులను హర్ట్ చేశారు" అంటూ కౌశల్ అభిమానులలో ఒకరు ట్విట్ చేసాడు. 
I appeal to all, especially the youth, to  keep away from this ‘caste’ system, says Manchu Manoj.
దానికి మనోజ్ సమాధానం ఇస్తూ "సినిమా అంటే ఒక్కరిది కాదు తమ్ముడూ. ఎంతో మంది ఆకలి కష్టం. ఎన్నో డిపార్టుమెంట్లు రాత్రి పగలు ఫ్యామిలీస్ ని వదిలి పని చేస్తారు. ఈ నెగెటివ్ థాట్స్ అన్నీ వదిలేయండి. అందమైన తెలుగు సినిమాను ఎంజాయ్ చేయండి. ప్రతి యాక్టర్.. టెక్నీషియన్ ను ప్రేమిద్దాం.. గౌరవిద్దాం" అంటూ మనోజ్ కౌశల్ అభిమానులకు రివర్స్ క్లాస్ పీకాడు. దీనితో మరింత రెచ్చిపోయిన కౌశల్ అభిమానులు మనోజ్ ను టార్గెట్ చేస్తూ ‘తారక్ అన్న ఫ్రెండుగా మీపై గౌరవం ఉంది. బిగ్ బాస్ లో నాని చేస్తుంది తప్పు. దానికి అతడు అనుభవించాలి. కౌశల్ ఆర్మీని లైట్ తీసుకుంటే అందరూ త్వరలోనే అనుభవిస్తారు" అంటూ మంచు మనోజ్ కు క్లాస్ పీకారు కౌశల్ అభిమానులు. దీనితో ప్రస్తుతం మనోజ్ కౌశల్ అభిమానుల మధ్య జరుగుతున్న మాటల వార్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: