ఈ మద్య చిత్రపరిశ్రమలో ఎక్కడ చూసినా కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని నటి శ్రీరెడ్డి పెద్ద ఉద్యమమే తీసుకు వచ్చింది.  తనకు టాలీవుడ్ లో ప్రముఖులు అన్యాయం చేసారని శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ లో జరుగుతున్న దారుణాలపై శ్రీరెడ్డి బహిరంగంగానే మాట్లాడుతోంది. మీడియాలో ఈ ఆరోపణలు చేస్తున్న సమయంలో తనకు మా అసోసియేషన్ వాళ్లు మెంబర్ షిప్ ఇవ్వడం లేదని ఏకంగా ఫిల్మ్ ఛాంబర్ ముందు శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేసింది.
శ్రీరెడ్డి సంచలనం..: నడిరోడ్డుపై అర్ధనగ్న ప్రదర్శన..!
తెలుగు సినిమాల్లో 75 శాతం అవకాశాలను తెలుగు అమ్మాయిలకే ఇవ్వాలని డిమాండ్ చేసింది. మాలో సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేసింది. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి అటు మహిళ సంఘాలు, ఇటు ఫ్యాన్ ఆగ్రహానికి గురైంది.  దాంతో ఇంట్లో నుంచి సోషల్ మాద్యమాల ద్వారా తన వ్యతిరేకత తెలియజేస్తుంది.  ఇదిలా ఉంటే తాజాగా కాస్టింగ్ కౌచ్ పేరుతో బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా వెలుగులోకి వచ్చింది. పది సంవత్సరాల క్రితం తన సహనటుడు నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని..డ్యాన్స్ పేరుతో ఎక్కడెక్కడో చేతులు వేసి తడిమాడని..లైంగికంగా వేధించాడని ఆరోపించింది. 

తాజాగా దీనిపై నటుడు నానా పటేకర్ స్పందించారు.  ఓ ఆంగ్ల మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘ఆ అమ్మాయి నాపై లేనిపోని ఆరోపణలు చేస్తుంటే నన్ను ఏం చేయమంటారు? సినిమా చిత్రీకరణ సమయంలో నాతో పాటు మరో వంద మంది ఉన్నారు.  అలాంటి తప్పు చేసి ఉంటే అంతమందిలో ఏ ఒక్కరైనా ఇది తప్పు అనే వారు కదా..తప్పు చేయనపుడు ఎలాంటి ఆరోపణలు ఉండవని అన్నారు.  ఈ విషయం గురించి నేను ఎంత మాట్లాడినా వృథానే.. నాపై ఆమె చేసిన ఆరోపణలకు చట్టపరంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నా. నేను ఏం మాట్లాడినా మీ మీడియా వర్గాలు ఏవేవో రాసేస్తాయి’ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: