అల్లు కుటుంబం నుండి వచ్చిన అల్లు శిరీష్ కు సినిమాలతో పాటు జ్యోతిష్యం అన్నా ముహూర్తాలు అన్నా చాల అభిరుచి. దీనికితోడు శిరీష్ కు సామాజిక సేవపట్ల కూడ బాగా ఇష్టం. ఇలాంటి పరిస్థుతులలో శిరీష్ తన ల్యాప్ టాప్ ను తనఅభిమాని కష్టాలు విని కరిగిపోయి అతడికి బహుమతిగా ఇచ్చిన సంఘటన అల్లు శిరీష్ అభిమానులకు బాగా కనెక్ట్ అయింది.
Allu-Brothers
శిరీష్ అల్లు అర్జున్ లు అన్నదమ్ములుగా మాత్రమే కాకుండా చాలసన్నిహితంగా ఉంటూ ఒకరికొకరు ఇండస్ట్రీలో చాల సపోర్టింగ్ గా ఉంటారు. ఇలాంటి పరిస్థుతులలో వీరిద్దరి సాన్నిహిత్యాన్ని తెలియచేసే మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈమధ్య అల్లు అర్జున్ తన తమ్ముడు అల్లు శిరీష్ కు  కొత్త యాపిల్ మాక్‌ ల్యాప్‌టాప్ గిఫ్టుగా ఇచ్చాడు. ఈవిషయాన్ని తెలియజేస్తూ శిరీష్ ఒక ట్వీట్ పెట్టాడు. 
Allu Sirish, Allu Sirish Films, Allu Sirish Next Film, Allu Sirish Upcoming Film, Allu Sirish New film, Allu Sirish New Movie, Allu Sirish Latest Film, Allu Sirish Movies, Entertainment news
‘20 సంవత్సరాల నుండి విండోస్ వాడుతున్నాను. ఇపుడు మాక్ ఓఎస్‌కు మూవ్ అవుతున్నాను. నాకు ఈ గిఫ్ట్ ఇచ్చిన అన్నయ్య అల్లు అర్జున్‌కు ధన్యవాదాలు. అన్నయ్య నాకు చిన్నతనంలో బెన్‌ క్యూ జాయ్ బుక్ నుండి ఇప్పుడు ఇచ్చిన ల్యాప్ టాప్ వరకు అన్నీ కూడా ఆయన ఇచ్చిన గిఫ్టులే’ అంటూ శిరీష్ బన్నీ పై ప్రశంసలు కురిపించాడు. శిరీష్ పెట్టిన ఈ ట్వీట్ మీద ఒక అభిమాని స్పందిస్తూ.. అన్నా నాకూ ఒక చిన్న ల్యాప్ టాప్ గిఫ్టుగా ఇవ్వొచ్చుకదా. నేను కొనాలి అంటే మరో మూడేళ్లు పడుతుంది. నాకు ఫ్యామిలీ బాధ్యతలు ఎక్కువ. సాలరీ తక్కువ. నా జాబ్‌లో ల్యాప్ టాప్ యూజ్ ఎక్కువగా ఉంటుంది కానీ నాకు ఇప్పటి వరకు ల్యాప్ టాప్ లేదు. నేను మీకు, బన్నీకి పెద్ద అభిమానిని’ అంటూ ట్వీట్ చేసి శిరీష్ దృష్టిని ఆకర్షించాడు. 

దీనితో స్వతహాగా సామాజిక స్పృహ ఎక్కువగా ఉన్న శిరీష్ స్పందిస్తూ ‘నువ్వేం బాధపడుకు తమ్ముడూ... నువ్వు సంపాదిస్తూ నీ ఫ్యామిలీకి సపోర్టుగా ఉండు. నాకు కొత్త ల్యాప్ టాప్ వచ్చింది కాబట్టి నా వద్ద ఉన్న సోనీ ల్యాప్ టాప్ నీకు ఇస్తాను. నీ పూర్తి వివరాలు మెయిల్ చేయ్’ అంటూ శిరీష్ తన అభిమానికి ఊహించని రిప్లయ్ ఇచ్చాడు. ఈ రిప్లయ్ కి ఆ అభిమాని ఆనందానికి హద్దులు లేవు..   


మరింత సమాచారం తెలుసుకోండి: