సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఈమధ్య రిలీజైన టీజర్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ 25వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ లుక్ అదిరిపోయింది.


భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ అనుకున్నది అనుకున్నట్టుగా సాగుతున్నా అనుకున్న టైం కు సినిమా రిలీజ్ కష్టమని అంటున్నారు. ఇప్పటివరకు తీసిన సినిమా రష్ చూస్తే సినిమా అనుకున్న విధంగా అవుట్ పుట్ రావడం లేదట.


అందుకే చిన్న గ్యాప్ ఇచ్చి రీ షూట్స్ ప్లాన్ చేస్తున్నారట. సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే. ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ సీన్స్ చాలా బాగుంటాయని అంటున్నారు. హీరోగా చాలా వెనుకపడి ఉన్న అల్లరి నరేష్ సపోర్టింగ్ రోల్ తో అయినా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.


మహేష్, పూజా ఇద్దరి పెయిర్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా ఉంటుందని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఏప్రిల్ కాకుంటే మే నెలలో మహేష్ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది కాబట్టి మహర్షి వస్తే జూన్ లోనే అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: